వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ ఉగ్రదాడి జమ్మూలో మాదిరే: ఓమర్ అబ్దుల్లా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి జమ్మూలో జరిగిన ఉగ్రదాడిని తలపిస్తోందని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా అన్నారు.

సోమవారం గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదులు పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడి 13 మంది ప్రాణాలను బలిగొన్నారు. ఈ సందర్భంలో ఓమర్‌ అబ్దుల్లా ఉగ్రవాదులు దాడిచేసిన సమయం, తీరును చూస్తుంటే అచ్చం జమ్మూలో జరిగినట్లుగా ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Punjab Attack Eerily Similar To Jammu Attacks, Says Omar Abdullah

సోమవారం ఉదయం సైనిక దుస్తులు ధరించిన సుమారు నలుగురు ఉగ్రవాదులు మొదట ఓ బస్సుపై కాల్పులు జరిపారు. అనంతరం పోలీస్ స్టేషన్‌పై కాల్పులు జరుపుతూ లోనికి ప్రవేశించారు. ఈ ఉగ్రదాడిలో గురుదాస్‌పూర్ ఎస్పీ భల్జీత్ సింగ్ మృతి చెందారు.

ఎస్పీ డిటెక్టివ్ విభాగంలో పని చేస్తున్నారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల్లో ఓ మహిళా ఉగ్రవాది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం 5.45గంటల నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.

మరోవైపు పాకిస్ధాన్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. కాశ్మీర్‌లోని జమ్మూసెక్టార్‌లో వెంబడి భారత సైనిక శిబిరాలపై కాల్పులకు పాల్పడింది. అయితేఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని, ప్రాణనష్టం కూడా జరగలేదని బిఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది జులై నెలలో పాక్ సైన్యం ఇప్పటి వరకూ 13 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

English summary
The terrorist attack in Punjab is "eerily similar" to attacks in the border belt of Jammu, former Jammu and Kashmir chief minister Omar Abdullah tweeted on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X