Punjab: ప్రధాని మోడీ కాన్వాయ్‌ను అడ్డుకున్నది తామేనంటూ ప్రకటించిన బీకేయూ క్రాంతికారి నేతలు
ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్‌పూర్ జిల్లాలోని పియారియానా గ్రామంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్‌ను అడ్డుకున్నది తామేనంటూ భారతీయ కిసాన్ యూనియన్ (క్రాంతికారి) సభ్యులు స్పష్టం చేశారు. బుధవారం పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు నిరసనగా రైతులు పియారియానా గ్రామ సమీపంలో ఫ్లైఓవర్‌పై భారీగా మోహరించారు.
Recommended Video
ఈ నిరసనకారులు ప్రధాని కాన్వాయ్ సమీపిస్తున్నట్లు చూసిన తర్వాత.. నిరసనకారులు రోడ్లపై నినాదాలు చేస్తూనే ఉన్నారు. నిరసనకారులు బీకేయూ క్రాంతికారి జెండాలైన ఆకుపచ్చ, ఎరుపు జెండాలను మోసుకెళ్లారని వర్గాలు చెబుతున్నాయి.

బీకేయూ (క్రాంతికారి) జనరల్ సెక్రటరీ బల్దేవ్ జిరా మాట్లాడుతూ.. 'అహంకారి మోడీ'కి రైతులు గుణపాఠం చెప్పారన్నారు. "ఉస్నే తుహాదే రాస్తే విచ్ కిల్ పాయే సి, అజ్ తుహాదీ తాకత్ నే మోడీ ను భజా తా ఈథాన్" అని ప్రధాని కాన్వాయ్ వెనుదిరిగిన తర్వాత నిరసనకారుల సమావేశంలో ఆయన అన్నారు.
బీకేయూ క్రాంతికారి ఒక అల్ట్రా లెఫ్ట్ రైతు సంఘం అని పేరుంది. ఎస్కేఎంలో భాగమైనప్పటికీ, వారు ఇటీవలే రైతు సంఘాల రాజకీయ ఏర్పాటు అయిన సంయుక్త్ సమాజ్ మోర్చాలో భాగం కాకూడదని ఎంచుకున్నారు. 2009లో, యూనియన్ ప్రెసిడెంట్ సూర్జిత్ ఫుల్ పై యూఏపీఏలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, ఐదు నెలల పాటు జైలులో ఉన్నారు. మావోయిస్టు సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టు చేశారు.
క్రాంతికారి కిసాన్ యూనియన్ ప్రెస్ సెక్రటరీ అవతార్ మెహ్మా మాట్లాడుతూ.. డిసెంబరు 31న బర్నాలాలో ఏడు కిసాన్ యూనియన్ల సమావేశం జరిగిందని, అక్కడ ప్రధాని పర్యటన సందర్భంగా భారీ నిరసనలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. "ప్రతి సంస్థ ఒక గ్రామంలో వారి బలం ఆధారంగా వేర్వేరు ప్రదేశాలలో నిరసనలు తెలపాలి. పియారియానా గ్రామంలో బీకేయూ క్రాంతికారి నిరసన వ్యక్తం చేసింది. వారు ఉదయం 10.30 గంటల నుంచి ఈ మార్గంలో సీజ్ చేశారు " అని పేర్కొన్నారు.

కాగా, బీకేయూ నిరసనలతో ప్రధాని మోడీ కాన్వాయ్ సుమారు 15 నిమిషాలపాటై ఫ్లైఓవర్ పైనే ఉండి పోయింది. ఆ తర్వాత ఆయన బటిండా విమానాశ్రయానికి చేరుకున్నారు. పాల్గొనాల్సిన సభను రద్దు చేసుకున్నారు. పంజాబ్ శాంతిభద్రతల అంశంపై ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్రం హోంశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వ సెక్యూరిటీ వైఫల్యమేనని మండిపడింది.












Click it and Unblock the Notifications