వివాదాస్పద వ్యాఖ్యలపై చన్నీ, ప్రియాంక వివరణ-బీజేపీ, ఆప్ ముప్పేట దాడితో
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో ఆ పార్టీని టార్గెట్ చేస్తూ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. యూపీ-బీహార్ భాయీల్ని(అన్నల్ని)పంజాబ్ కు రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందంటూ ఓటర్లను ఉద్దేశించి చన్నీ తాజాగా వ్యాఖ్యానించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో యూపీకి చెందిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా పక్కనే ఉండి చప్పట్లు కొట్టారు. దీంతో చన్నీ వ్యాఖ్యల్ని, ప్రియాంక చప్పట్లను బీజేపీ, ఆప్ టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి.
తాను చేసిన 'యుపి, బీహార్ కే భయ్యా' వ్యాఖ్యపై వివాదం చెలరేగిన నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తన వ్యాఖ్యలపై స్పందించారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని తెలిపారు. నా ప్రకటనను వక్రీకరించారు.

పంజాబ్‌కు వచ్చిన వలసదారులందరూ రాష్ట్ర అభివృద్ధి కోసం తమ చెమట, రక్తాన్ని ధారపోశారంటూ చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఇవాళ తెలిపారు. ఈ వలసదారులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. తాను ఆప్ నేతల గురించి మాట్లాడానని, పంజాబ్‌లో పనిచేస్తున్న వలసదారుల గురించి కాదని చరణ్‌జిత్ సింగ్ చన్నీ అన్నారు.

చన్నీ వ్యాఖ్యల వివాదంపై ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. పంజాబ్‌ను పంజాబీలు నడపాలని సీఎం చరణ్‌జిత్ చన్నీ అన్నారని ఆమె వెల్లడించారు. ఆయన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారన్రాు. పంజాబ్‌కు వచ్చి పాలించేందుకు యూపీ నుంచి ఎవరూ ఆసక్తి చూపడం లేదని తాను అనుకోవడం లేదన్నారు. మీరు (బీజేపీ) యూపీ రైతులను అవమానించారని,మీ మంత్రుల కొడుకు అమాయక రైతులను చంపిన విధంగా, ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు మాత్రమే ప్రధాని పంజాబ్‌కు వస్తున్నారన్నారు. కానీ రైతుల నిరసనల సమయంలో కాదన్నారు.












Click it and Unblock the Notifications