పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్థులు అంతా ఉన్నత విద్యావంతులే, ఇంజినీర్, టీచర్.. కానీ
పంజాబ్ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపు గుర్రాలకు టికెట్లు కేటాయిస్తోంది. అయితే చాలా మంది ఉన్నత విద్య చదివిన వారే ఉన్నారు.. కానీ ఎక్కువ మంది రాజకీయ కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. సాప్ట్ వేర్ ఇంజినీర్, టీచర్.. ఇతర డిగ్రీలు చేసిన వారు కాంగ్రెస్ పార్టీ నుంచి పంజాబ్ ఎన్నికల బరిలో దిగారు. వీరిలో కొందరు తొలిసారి పోటీ చేస్తోన్న వారు కూడా ఉన్నారు.

నేపథ్యం ఇదీ..
పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ మేనల్లుడు సందీప్ అబొహర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అజ్మిర్ అండ్ ప్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి సందీప్ విద్యాభ్యాసం కొనసాగింది. అతను మాజీ యూత్ కాంగ్రెస్ నేత కూడా.. ఇక సాప్ట్ వేర్ ఇంజినీర్ అయినా మళవిక సూద్ సచర్.. కూడా నటుడు సోనూ సూద్ సోదరి అనే సంగతి తెలిసిందే. ఆమె మొఘ నుంచి బరిలోకి దిగారు.

లెక్చరర్..
బుద్‌లాడా ఎస్సీ నియోజకవర్గం నుంచి రణ్‌వీర్ కౌర్ మియన్ పోటీ చేస్తున్నారు. ఇతను ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఇంగ్లిష్‌లో పీహెచ్‌డీ చేశారు. పంజాబ్ మంత్రి బ్రహ్మ్ మొహింద్రా కుమారుడు మోహిత్ మొహింద్రా కూడా పాటియాలా రూరల్ నుంచి పోటీచేస్తున్నారు. ఇతను యూత్ కాంగ్రెస్ నేత.. లా చేశారు. క్రీడాకారుడు కూడా.

కేంబ్రిడ్జిలో ఎంబీఏ
రాయికోట్ నుంచి కమిల్ అమర్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఇదీ కూడా ఎస్సీ రిజర్వ్‌డ్ కాగా.. ఇతను ఎంబీఏ చేశారు. యుకేలోని కేంబ్రిడ్జిలో పూర్తిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఇతని తండ్రి డాక్టర్ అమర్ సింగ్ ఫతేగడ్ సాహిబ్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ సీఎం ప్రకాశ్ సిం్ బాదల్ కంచుకోట.. లాంబీ నుంచి అతని కుటుంబం నుంచి జగ్ పాల్ సింగ్ అబుల్ ఖురానా బరిలోకి దిగారు. ఇతను గుర్నామ్ సింగ్ కుమారుడు.. ఇతను 1990లో మంత్రిగా పనిచేశారు. బల్వానా ఎస్సీ నియోజకవర్గం నుంచి రాజిందర్ కౌర్ పోటీ చేస్తున్నారు. ఇతను కూడా టీచింగ్ వదిలేసి.. రాజకీయాల్లోకి వచ్చారు. పంజాబీ సింగర్ సిదు మూసేవాలా.. మాన్సా నుంచి పోటీ చేస్తున్నారు. ఘర్షంకర్ నుంచి అమర్ ప్రీత్ సింగ్ లాలీ పోటీ చేస్తున్నారు.