Punjab elections: ఆప్ సీఎంఅభ్యర్థి భగవంత్ మాన్ ఎన్నికలప్రచారంలో కోవిడ్ రూల్స్ ఉల్లంఘన; ఈసీ నోటీసులు

భారతదేశంలో ఐదు రాష్ట్రాలకు కీలకంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో వాతావరణం వేడెక్కింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నెల ప్రారంభంలో కోవిడ్ 19 ప్రోటోకాల్ లను పాటించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలలో ర్యాలీలు, బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో తాజాగా ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన కోవిడ్ ప్రోటోకాల్స్ ను ఉల్లంఘించినందుకు భారత ఎన్నికల సంఘం సోమవారం నాడు ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్‌కి నోటీసు పంపింది.

ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ చీఫ్ భగవంత్ మాన్ ఎన్నికల ప్రచారం

ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ చీఫ్ భగవంత్ మాన్ ఎన్నికల ప్రచారం

ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ చీఫ్ మరియు సంగ్రూర్ నుండి పార్లమెంటు సభ్యుడు కూడా అయిన భగవంత్ మాన్, రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ధురి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో ఆయనకు వివిధ గ్రామాలలో పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు. ఆయన పర్యటన నేపధ్యంలో నినాదాలు చేస్తూ పూల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారంలో చాలా మంది మాస్కులు లేకుండా పాల్గొన్నారు. సామాజిక దూర నిబంధనలను బేఖాతరు చేసి గుంపులు గుంపులుగా కనిపించారు.

కొందరినే ఆహ్వానించాం అన్న ఆప్

కొందరినే ఆహ్వానించాం అన్న ఆప్

కొంతమంది స్థానికులను మాత్రమే ఆహ్వానించామని, అయితే పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ పర్యటన వార్త సోషల్ మీడియాలో ప్రచారం కావటంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారని పార్టీ పేర్కొంది. సంగ్రూర్ తర్వాత, మన్ లడ్డా, కంఝలా, రాణికే మరియు ముల్లోవల్‌తో సహా వివిధ గ్రామాలను భగవంత్ మాన్ సందర్శించారు. ప్రతి గ్రామంలో ప్రజల నుండి పెద్దఎత్తున మద్దతు ప్రకటించడంతో మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఇది నా ఎన్నికలు కాదు, ఇది మీ ఎన్నికలు. గత ఎన్నికల మాదిరిగానే మీరు నాకు ఓటేస్తారని నాకు నమ్మకం ఉంది అని భగవంత్ మాన్ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు.

గుమికూడిన ఫోటోలకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.. నోటీసులు జారీ

గుమికూడిన ఫోటోలకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.. నోటీసులు జారీ

సంగ్రూర్ జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ అన్వర్ భాసౌర్ ధురిలో కార్యాలయాన్ని భగవంత్ మాన్ ప్రారంభించినట్లు తెలిపారు. భగవంత్ మాన్ ధురి పర్యటన సందర్భంగా కొంతమంది స్థానికులు గుమిగూడిన కొన్ని ఫోటోలను పంపిన కొందరు ఎన్నికల ప్రోటోకాల్స్ ఆమ్ ఆద్మీ నేతలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ర్యాలీలు మరియు రోడ్‌షోలను నిషేధించినందున తాము ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసు జారీ చేశామని ఎన్నికల అధికారి ఇస్మత్ విజయ్ సింగ్ తెలిపారు.

ఫిబ్రవరి 20న పంజాబ్ పోలింగ్ .. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి తొలి నోటీస్

ఫిబ్రవరి 20న పంజాబ్ పోలింగ్ .. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి తొలి నోటీస్


ఎన్నికల సంఘం జనవరి 8న, ఎన్నికల తేదీలను ప్రకటిస్తూ, కోవిడ్-19 దృష్ట్యా సవరించిన "విస్తృత మార్గదర్శకాలు" జారీ చేసింది, ఇది జనవరి 15 వరకు రోడ్‌షోలు మరియు ర్యాలీలను నిషేధించింది. నిషేధాన్ని శనివారం ఈ నెలాఖరు వరకు పొడిగించారు. పంజాబ్‌లోని 117 స్థానాలకు ఫిబ్రవరి 20న ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లక్నోలోని తన కార్యాలయ ప్రాంగణంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సమాజ్‌వాదీ పార్టీకి ఎన్నికల సంఘం గతంలో నోటీసు జారీ చేసింది. ఇక తాజాగా పంజాబ్ ఎన్నికల నేపధ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+