పంజాబ్ ప్రచారభేరీ: రంగంలోకి రాహుల్.. మెగా నుంచి క్యాంపెయిన్.. ఎప్పటినుంచి అంటే
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ సన్నాహాలు ముమ్మరం చేసింది. ప్రచార పర్వాన్ని స్పీడప్ చేసింది. అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచార బరిలో దిగబోతున్నారు. జనవరి 3వ తేదీ నుంచి పంజాబ్‌లో ప్రచారం ప్రారంభించబోతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాబోయే ముఖ్యమంత్రి ఎవరనేదీ లేకుండానే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ బరిలోకి దిగవచ్చని భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన వెంటనే సీఎంగా చరణ్‌జిత్ చన్నీ బాధ్యతలు చేపట్టారు. 2022 ఎన్నికల్లో చరణ్‌జిత్ చన్నీ నేతృత్వంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్తుందని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ వైఖరి దృష్ట్యా హైకమాండ్ తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ నెలలో రాహుల్ గాంధీని కలిశారు. ముగ్గురు నేతల మధ్య జరిగిన భేటీలో వచ్చే ఏడాది పంజాబ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై చర్చనీంచినట్టు సమాచారం. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాహుల్ గాంధీని కలిశారు.

జనవరి 3న మోగాలో జరిగే ర్యాలీలో రాహుల్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. కాగా అటు పంజాబ్, ఇటు ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం ఉన్నా ప్రియాంక గాంధీ సభలు, ర్యాలీలతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తు పార్టీ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి రాహుల్‌గాంధీ జనవరి 3 నుంచి ప్రచారంలో పాల్గొంటుండంతో అటు పంజాబ్ కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఈసారి కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారం కైవసం చేసుకోవాలనే కోణంలో కాంగ్రెస్ ఎత్తులు వేస్తుంది.
2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో మెజారిటీని సాధించింది. 10 ఏళ్ల తర్వాత ఎస్ఏడీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించింది. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 20 సీట్లు గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శిరోమణి అకాలీదళ్ 15 సీట్లు మాత్రమే గెలుచుకోగా, బీజేపీకి 3 సీట్లు వచ్చాయి. ఓట్ల శాతం గురించి చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీకి 38.5 శాతం ఓట్లు రాగా, అకాలీదళ్‌కు 25.3 శాతం ఓట్లు వచ్చాయి. అకాలీదళ్ కంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ల శాతం తక్కువగా ఉంది. సీట్ల పరంగా ఆప్ లాభపడింది. అకాలీ కంటే ఐదు సీట్లు ఎక్కువ వచ్చాయి. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఐదు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.












Click it and Unblock the Notifications