punjab health minister share stage congress leader rahul gandhi test Coronavirus పంజాబ్ వేదిక రాహుల్ గాంధీ politics
పంజాబ్ మంత్రికి కరోనా: రాహుల్ గాంధీతో వేదిక పంచుకున్న బల్బీర్, పంజాబ్ సీఎం కూడా..
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఇటీవల పంజాబ్‌లో ఆందోళనలు కొనసాగాయి. సోమవారం సంగ్రూర్‌లో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి బల్బీర్ సింగ్ తదితరులు వేదికపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. వారితో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే మంత్రి బల్బీర్ సింగ్ కరోనా బారినపడ్డారు. దీంతో అమరీందర్ సింగ్, రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటీ అని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.
సంగ్రూర్‌లో జరిగిన వేదికపై అమరీందర్ సింగ్ వెనకాల బల్బీర్ సింగ్ ఉన్నారు. మరుసటి రోజు మంగళవారం బల్బీర్‌కు కరోనా వైరస్ నిర్ధారణ జరిగింది. దీంతో అమరీందర్ పరిస్థితిపై ఆందోళన నెలకొంది. అయితే బల్బీర్ సింగ్‌కు జ్వరం, గొంతులో నొప్పి ఉండటంతో.. వైద్యులను సంప్రదించారు. అతని ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది అని వైద్యుడు మంజిత్ సింగ్ పేర్కొన్నారు. మంత్రి హోం ఐసోలేషన్‌లో ఉన్నారని.. అతనిని కాంటాక్ట్ అయినవారు కూడా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

సోమవారం జరిగిన నిరసనలోనే బల్బీర్ సింగ్ పాల్గొన్నారు. మరుసటి రోజే వైరస్ బారినపడ్డారు. అయితే వీరితోపాటు హరీశ్ రావత్, సునీల్ జకార్, బల్బీర్ సిద్దు, విజయ్ ఇందర్ సింగ్లా, రాణా గుర్మీత్ సోది, దీపెదర్ హుడా తదితరులు వేదికపై ఉన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్ ర్యాలీలను రాహుల్ గాంధీ కొనసాగిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం హర్యానాలో ప్రవేశించారు.