పీఎన్బీ స్కాం: రిస్క్ ఆఫీసర్‌గా ఏకే ప్రధాన్ నియామకం
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో కుంభకోణం విలువ(రూ.11,380కోట్లు) మరో రూ.1,300 కోట్లు పెరిగి రూ.12,600 కోట్లకు చేరడంతో దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా గ్రూప్ చీఫ్ రిస్క్ ఆఫీసర్‌గా ఏకే ప్రధాన్‌ను నియమించింది.
ఈ విషయాన్ని మంగళవారం బీఎస్‌ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది.
నీరవ్ మోడీ, ఛోక్సీలు చేసిన కుంభకోణం విలువ రూ.12,600 కోట్లకు చేరినట్లు పీఎన్‌బీ తన ఫైలింగ్‌లో పేర్కొంది.

ఈ ఫైలింగ్‌ను సోమవారం రాత్రి బీఎస్‌ఈకు సమర్పించింది. పీఎన్‌బీలోని అక్రమార్కులైన ఉద్యోగులతో కుమ్మక్కై మోడీ, చౌక్సీలు తప్పుడు పత్రాలను సృష్టించి నిధులను తరలించారని తెలిపింది.
కాగా, ఇప్పటికే ఈ కేసులో వందల కోట్లు స్వాధీనం చేసుకోగా, కీలక నిందితుడో గోకుల్ శెట్టితోపాటు పలువురు ఉద్యోగులను అరెస్ట్ చేయడం జరిగింది.












Click it and Unblock the Notifications