Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పంజాబ్ కాబోయే సీఎం భగవంత్ మాన్; ప్రమాణ స్వీకారంపై, పంజాబ్లో ఆప్ పాలనపై ఆసక్తికరవ్యాఖ్యలు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. చీపురు పార్టీ పంజాబ్ రాష్ట్రంలోని ప్రత్యర్థి పార్టీలను ఊడ్చి పారేసింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం ఖరారు కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ సంబరాలలో మునిగి పోయింది. ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం కనిపించిన తరుణంలో ఆయన గురుద్వారాలో ప్రార్థనలు నిర్వహించారు,. సంగ్రూర్ లోని శ్రీ మస్తువాన సాహిబ్ గురుద్వారా ను సందర్శించిన ఆయన పంజాబ్ భవిష్యత్తు కోసం గురుద్వారాలో ప్రార్థనలు నిర్వహించినట్లు వెల్లడించారు.

ప్రమాస్వీకారంపై భగవంత్ మాన్ ఆసక్తికర ప్రకటన

ప్రమాస్వీకారంపై భగవంత్ మాన్ ఆసక్తికర ప్రకటన

ఇదిలా ఉంటే మరో పక్క భగవంత్ మాన్ ఇంటి వద్ద కార్యకర్తల సందడి కొనసాగుతోంది. భారీగా జిలేబీలను తయారు చేస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. న్నికల్లో విజయం సాధించిన సందర్భంగా భగవంత్ మాన్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన నవాన్‌షహర్ జిల్లాలోని ఖట్కర్కలన్‌లో తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించనున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన భగవంత్ మాన్ గురువారం ప్రకటించడంతో అభిమానుల నుండి నుండి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో ఉండదన్న భగవంత్ మాన్

ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో ఉండదన్న భగవంత్ మాన్

అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఆనవాయితీగా ముఖ్యమంత్రి ఫోటో ఉండదని ప్రకటించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్‌భవన్‌లో జరగదని పేర్కొన్న ఆయన ఖట్కర్కలన్‌లో జరుగుతుందని తేదీని తరువాత ప్రకటిస్తాము అని ధురిలో తన విజయ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో ముఖ్యమంత్రి చిత్రపటానికి బదులు భగత్ సింగ్ మరియు బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలు ఉంటాయని ప్రకటించారు.

పంజాబ్ లో కీలక నాయకుల ఓటమిపై ఆప్ సీఎం

పంజాబ్ లో కీలక నాయకుల ఓటమిపై ఆప్ సీఎం

భగవంత్ మాన్ 58,000 ఓట్లకు పైగా ఆధిక్యతతో విజయం సాధించారు. ఓడిపోయిన ప్రత్యర్థులను గురించి ప్రస్తావిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కీలక స్థానాలలో విజయం సాధించిందని భగవంత్ మాన్ ప్రకటించారు. బడే (ప్రకాష్ సింగ్) బాదల్ సాహిబ్ ఓడిపోయాడు, సుఖ్బీర్ (బాదల్) జలాలాబాద్ నుండి ఓడిపోయాడు, కెప్టెన్ పాటియాల నుండి ఓడిపోయాడు. సిద్ధూ మరియు మజితియా కూడా ఓడిపోయారు. (చరణ్‌జిత్ సింగ్) చన్నీ రెండు స్థానాల్లో ఓడిపోయారు అంటూ వ్యాఖ్యానించారు.

సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రాధాన్యతా అంశాలు ఇవే

సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రాధాన్యతా అంశాలు ఇవే

పాఠశాలలు, ఆరోగ్యం, పరిశ్రమలు, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, మహిళల భద్రత, క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలపై సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దృష్టి సారిస్తానని భగవంత్ మాన్ వెల్లడించారు. ఒక్క నెల రోజుల్లోనే పంజాబ్లో మార్పును మీరు చూస్తారు అంటూ ఆయన హామీ ఇచ్చారు. పంజాబ్ అభ్యున్నతి కోసం ప్రజలు కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఆప్‌కు ఓటు వేయని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల కోసం పని చేస్తుందని అన్నారు.

పంజాబ్ లో ఆప్ ఘన విజయం.. కేజ్రీవాల్ ఉగ్రవాది కాదని ప్రజలు నమ్మారన్న ఆప్ అధినేత

పంజాబ్ లో ఆప్ ఘన విజయం.. కేజ్రీవాల్ ఉగ్రవాది కాదని ప్రజలు నమ్మారన్న ఆప్ అధినేత

పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు గాను గురువారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన ఆరు గంటల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ 91 స్థానాల్లో ఆధిక్యంతో క్లీన్ స్వీప్ చేసింది. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్ర ప్రజల విప్లవం పట్ల శుభాకాంక్షలు తెలియజేశారు. కేజ్రీవాల్ కు ఉగ్రవాది కాదని ప్రజలు గట్టిగా నమ్మారని, అందుకే ఈ విజయాన్ని కట్టబెట్టారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+