చన్నీ పంజాబ్ ను సురక్షితంగా ఉంచలేరు - రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీగా చేయగలరా : అమిత్ షా..!!

పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ నెల 20న పంజాబ్ లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో... ప్రధాని మోదీ రేపటి నుంచి మూడు రోజుల పాటు పంజాబ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ రోజున కేంద్ర హోం మంత్రి అమిత్ షా..కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. లూథియానాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పంజాబ్ సీఎం చన్నీ ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేసారు. పంజాబ్‌లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చన్నీసాహబ్ కలలు కంటున్నారని అన్నారు.

దేశ ప్రధాని వెళ్లే దారిని భద్రంగా ఉంచలేని వ్యక్తి పంజాబ్‌ను సురక్షితంగా ఉంచలేరంటూ వ్యాఖ్యానించారు. పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంతో పాటుగా దేశాన్ని రక్షించలేదని ఫైర్ అయ్యారు. చన్నీ నాయకత్వంలో పంజాబ్ సురక్షితంగా ఉంటుందా అని ప్రశ్నించారు. చన్నీ సాహెబ్ మత మార్పిడిని ఆపలేరంటూ మండిపడ్డారు. కేజ్రీవాల్ ఇచ్చిన హామీలను షా ప్రస్తావించారు. కేజ్రీవాల్‌కు భద్రతతో ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. కేజ్రీవాల్ పార్టీ నుండి ఎవరైనా ముఖ్యమంత్రి అయితే, మత మార్పిడిని ఆపలేరన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే మతం మారే వారు పంజాబ్ బయట కనిపిస్తారని షా చెప్పుకొచ్చారు. ఢిల్లీని డ్రగ్స్ నియంత్రించలేని కేజ్రీవాల్ పంజాబ్ ను డ్రగ్స్ ఫ్రీగా చేయగలరా అని నిలదీసారు.

Punjab not safe under Channi regime, says Amit Shah at Ludhiana rally

పంజాబ్‌లోని ప్రతి ఇంటి నుంచి బిడ్డ సైనిక సేవలో ఉన్నారని కొనియాడారు. ఉన్నాడు. 40 ఏళ్లుగా సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ కాంగ్రెస్ ఈ సమస్యకు పరిష్కారం కనుగొనలేదు. మోడీ ప్రభుత్వం వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌ను అమలు చేసిందని గుర్తు చేసారు. ఢిల్లీలో సిక్కులు హత్యకు గురయ్యారని.. హంతకులను పట్టుకునేందుకు కాంగ్రెస్ ఏమీ చేయలేదన్నారు. మోడీ సిట్‌ వేసి దోషులను జైలుకు పంపారని అమిత్ షా గుర్తు చేశారు. పంజాబ్ సంస్కృతికి బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవం ఇస్తోందన్నారు. రూ.120 కోట్లతో కర్తార్‌పూర్‌ సాహిబ్‌ కారిడార్‌ పనులు పూర్తి చేసి భక్తులకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారని అమిత్ షా ఎన్నికల ర్యాలీలో చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+