యూపీ, పంజాబ్‌లో ముగిసిన పోలింగ్, అక్కడ 2017 కన్న తక్కువగా ఓటింగ్
చెదురు మదురు ఘటనలు మినహా ఉత్తరప్రదేశ్‌లో మూడో విడత, పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక ప్రశాంతంగా జరిగాయి. పంజాబ్‌లో ఒకే విడతలో మొత్తం 117 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎస్ కరుణరాజు వెల్లడించారు. సాయంత్రం 5 గంటల సమయానికి 63 శాతం పోలింగ్ నమోదైంది.
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటలకు ముందు క్యూలైన్లలో ప్రవేశించినవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ సారి పంజాబ్ ఎన్నికల్లో 1,304 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. వీరిలో 93 మంది మహిళలు కాగా, ఇద్దరు ట్రాన్స్ జెండర్లు కూడా ఉన్నారు. పంజాబ్‌లో మాత్రం 2017 కన్నా తక్కువ పోలింగ్ జరిగింది. అప్పుడు 77.36 పోలింగ్ జరిగింది. అంటే దాదాపు 12 శాతం ఎక్కువ ఓటింగ్ జరిగింది. ఈ సారి ఆ స్థాయిలో జనాలు ఆసక్తి కనబరచలేదు. మార్చి 10న ఓట్లు లెక్కించనున్నారు.
ఇటు, ఉత్తరప్రదేశ్ లో నేడు మూడో విడత పోలింగ్ జరిగింది. 59 స్థానాలకు పోలింగ్ జరిగింది. 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి 60.18 శాతం ఓటింగ్ నమోదైంది. 2.06 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇటు హర్దొయ్‌లో బహిరంగ సభపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. గతంలో ఇక్కడ ఉన్న ప్రభుత్వం ప్రజలు, సంక్షేమ కార్యక్రమాలు అంటే పట్టించుకోలేదని మోడీ ధ్వజమెత్తారు. అప్పుడు మాఫియా, క్రిమినల్స్‌కు సపోర్ట్ చేశారని మోడీ మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిస్థితి మారిపోయిందని చెప్పారు. హర్దొయ్ ప్రజలు ఈ సారి రెండు సార్లు హోళి జరుపుకునేందుకు సిద్దంగా ఉండాలని మోడీ కోరారు. ఒకటి సాంప్రదాయ హోళి కాగా.. మరొకటి, ఫలితాలు వెలుబడిన మార్చి 10వ తేదీ అని చెప్పారు. ఆ రోజున పోలింగ్ బూతుల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని శ్రేణులకు మోడీ సూచించారు.












Click it and Unblock the Notifications