హంగ్ లేదు, కాంగ్రెస్‌దే విక్టరీ: ఏకపక్షంగా ఫలితాలు, సీఎం పదవీపై దాటవేసిన సిద్దూ

పంజాబ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన పార్టీలు ముమ్మరం చేశాయి. గెలుపు కోసం తమ అస్త్ర శస్త్రాలను సిద్దం చేస్తున్నాయి. పంజాబ్‌లో హంగ్ ఏర్పడనుందనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇక్కడ హంగ్ కాదు.. ఏకపక్ష విజయం తప్పదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తోందని చెప్పారు.

ప్రజలకు సేవ చేయడంలో సంతోషం ఉందని చెప్పారు. రాజకీయాల్లో ఎవరూ కూడా హ్యాపీగా ఉండరని చెప్పారు. ఎన్ని పార్టీలు పోటీ చేసినా.. అధికారం ఒక పార్టీకే అని.. అదీ కాంగ్రెస్ పార్టీ అని మరోసారి స్పష్టంచేశారు. కాంగ్రెస్ మరోసారి అధికారం చేపడితే.. సీఎం పదవీ చేపట్టడంపై అభిప్రాయం ఏంటీ అని రిపోర్టర్ ప్రశ్నించారు. దీనిప సిద్దూ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతల సమూహం అని చెప్పారు.

Punjab wont see a hung assembly, results will be one-sided: Sidhu

వారే పెద్ద ఇంజిన్ అని చెప్పి తప్పించుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సీఎం చన్నీని అనౌన్స్ చేసింది. సిద్దూ సమక్షంలోనే రాహుల్ గాంధీ ప్రకటన చేశారు. తాను హై కమాండ్ నిర్ణయాన్ని శిరసా వహిస్తానని వివరించారు.

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు గురించి అడగగా.. అలాంటిది ఏమీ లేదని చెప్పారు. జనం ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉంటారని చెప్పారు. ఆప్ గురించి అడగగా.. ఢిల్లీలో ఆ పార్టీ విఫలమైందని చెప్పారు. దీనిపై అమరీందర్ సింగ్ కూడా నిరాశ చెందారని తెలిపారు. తమ పార్టీ గెలుస్తోందని స్పష్టంచేశారు. మిగతా పార్టీలకు పరాజయం అని.. తనకు సీఎం పదవీ ఆశ లేదని చెప్పారు. హై కమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తానని సిద్దూ స్పష్టంచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+