వ్యాక్సిన్లే శ్రీరామరక్ష .. భారతదేశంలో వ్యాక్సిన్స్ తీసుకున్న వారిలో కోవిడ్ మరణాలు 0.4 శాతం మాత్రమే !!

కరోనా నియంత్రణ కోసం ప్రపంచవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన ఇస్తున్న వ్యాక్సిన్లు కరోనా సోకినప్పటికీ రోగుల మరణాలను, ఆసుపత్రులలో చేరికలను గణనీయంగా అరికట్టగలవని తాజా అధ్యయనం వెల్లడించింది. భారతదేశంలో వినాశకరమైన సెకండ్ వేవ్ కొనసాగిన సమయంలో, ఇప్పుడు లాస్ ఏంజిల్స్ నుండి మెల్బోర్న్ వరకు అధికంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ సోకిన వారికి కూడా ఈ వ్యాక్సిన్ల వల్ల చాలా వరకు మరణాలు తగ్గాయని పరిశోధకుల కొత్త అధ్యయనం వెల్లడించింది.

Recommended Video

    Avoid These Activities After Taking The COVID-19 Vaccine || Oneindia Telugu
     టీకాలు వేసిన తరువాత సోకిన వారిలో 0.4% మంది మృతి

    టీకాలు వేసిన తరువాత సోకిన వారిలో 0.4% మంది మృతి

    ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నివేదా గుప్తా నేతృత్వంలోని పరిశోధకుల కొత్త అధ్యయనం ప్రకారం, టీకాలు వేసిన తరువాత సోకిన వారిలో 0.4% మంది మరణించినట్టు తేల్చింది. 677 కోవిడ్ రోగుల జీనోమ్ సీక్వెన్సింగ్ డేటాను విశ్లేషించిన ఈ అధ్యయనంలో, పూర్తిగా టీకాలు వేసిన కేసులలో 86% డెల్టా వేరియంట్ కారణంగా ఉన్నాయని కనుగొన్నారు.
    కోవిడ్ బాధితులలో కరోనా తీవ్రతను తగ్గించడానికి, మరణాలను నివారించడానికి వ్యాక్సిన్లు కీలక పాత్రను పోషిస్తాయని ఈ పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి .

    దేశంలో ఆధిపత్య వేరియంట్ గా డెల్టా

    దేశంలో ఆధిపత్య వేరియంట్ గా డెల్టా


    ఇదే సమయంలో టీకా సమర్థత పై ఉన్న అనేక సందేహాలను నివృత్తి చేస్తున్నాయి. ముఖ్యంగా 111 దేశాలు ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్ బారిన పడినట్టు తెలుస్తుంది. గత అక్టోబర్‌లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా కనుగొనబడిన ఈ వేరియంట్ యు.కె, యు.ఎస్ మరియు ఆస్ట్రేలియాలో ఆధిపత్య జాతిగా అవతరించింది. ఈ వేరియంట్ ను సైతం సమర్థవంతంగా వ్యాక్సిన్లు ఎదుర్కొంటున్నాయని అధ్యయనం తేల్చింది.

    వ్యాక్సిన్లే శ్రీరామ రక్ష ... పదేపదే చెప్తున్న నిపుణులు

    వ్యాక్సిన్లే శ్రీరామ రక్ష ... పదేపదే చెప్తున్న నిపుణులు


    ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కరోనా వ్యాక్సిన్ దేశంపై ప్రధానంగా దృష్టి సారించాలని, పేద ధనిక దేశాల తారతమ్యం లేకుండా అందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒకే విధంగా సాగాలని పదేపదే విజ్ఞప్తి చేస్తుంది. బ్లూమ్‌బెర్గ్ యొక్క వ్యాక్సిన్ ట్రాకర్ ప్రకారం, దేశం ఇప్పటివరకు 1.3 బిలియన్ జనాభాలో 5.7% మాత్రమే టీకాలు వేసింది. ఇదిలా ఉంటే ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని టీకా కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని, అప్పుడే తీవ్ర నష్టం నుంచి బయటపడగలుగుతాము అని అంచనా వేస్తున్నారు.

    కరోనా థర్డ్ వేవ్ నేపధ్యంలో అలెర్ట్

    కరోనా థర్డ్ వేవ్ నేపధ్యంలో అలెర్ట్


    ఇదే సమయంలో సామాజిక దూరం నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి ఎక్కువ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజల పైన ఉందని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు నిపుణులు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం నిబంధనలను పాటించడం, సమీప వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవడం చేస్తే కరోనా థర్డ్ వేవ్ ముప్పు నుంచి కాపాడుకున్నట్టే అని అధ్యయనం చెబుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+