వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి.. సంచలన నిర్ణయం తీసుకున్న బీజేపీ

|
Google Oneindia TeluguNews

ఉత్తరాఖండ్ తదుపరి సీఎంగా బీజేపీ నేత పుష్కర్ సింగ్ ధామిని ఈ రోజు ఉత్తరాఖండ్ బిజెపి శాసనసభ పార్టీ ఎన్నుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఆయనను పదకొండవ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. పుష్కర్ త్వరలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో ఉత్తరాఖండ్ తదుపరి సీఎంగా బీజేపీ శాసనసభా పార్టీ పుష్కర్ ను ఎన్నుకుంది.

పుష్కర్ సింగ్ ధామికి సీఎంగా అవకాశం

పుష్కర్ సింగ్ ధామికి సీఎంగా అవకాశం

రాజధాని డెహ్రాడూన్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో 57 మంది ఉత్తరాఖండ్ బిజెపి ఎమ్మెల్యేలు ఈ రోజు సమావేశమైన తరువాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సన్నిహితంగా భావించిన పుష్కర్ సింగ్ ధామి పేరు ఈ రోజు ప్రకటించబడింది. 45 ఏళ్ల పుష్కర్ సింగ్ ధామి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఖతిమా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆయన 2002 నుంచి 2006 మధ్య బిజెపి రాష్ట్ర జనతా యువమోర్చా కు అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి భగత్ సింగ్ కోషియారికి స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా పని చేశారు.

నరేంద్ర సింగ్ తోమర్ , రావత్ తో సహా ఎమ్మెల్యేలతో భేటీ

నరేంద్ర సింగ్ తోమర్ , రావత్ తో సహా ఎమ్మెల్యేలతో భేటీ

ఈరోజు జరిగిన సమావేశంలో బిజెపి ఎమ్మెల్యేలతో పాటు, బిజెపి కేంద్ర పరిశీలకుడు నరేంద్ర సింగ్ తోమర్, మధ్యాహ్నం ఒంటిగంటకు రాజధాని డెహ్రాడూన్ చేరుకున్నారు మరియు దాని రాష్ట్ర ఇన్‌ఛార్జి దుష్యంత్ కుమార్ గౌతమ్ పాల్గొన్నారు. సమావేశానికి ముందు, నరేంద్ర సింగ్ తోమర్ , రావత్ తో సహా పలువురు రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపారు.సత్పాల్ మహారాజ్, ధన్ సింగ్ రావత్, పుష్కర్ సింగ్ ధామిలతో సహా దాదాపు అరడజను మంది ఎమ్మెల్యేల పేర్లు సీఎం రేసులో పరిశీలించిన నాయకులు గత అనుభవాల దృష్ట్యా ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే వైపు అధిష్టానం మొగ్గు చూపడం జరిగింది.

నాలుగు నెలల్లో మూడో సీఎం

నాలుగు నెలల్లో మూడో సీఎం

తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు పుష్కర సింగ్ ధామి ఆనందం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీకి పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తన ముందు పెద్ద సవాల్ ఉందని పేర్కొన్న పుష్కర్, పార్టీ నాయకులు అందర్నీ కలుపుకొని పని చేస్తానని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్ లో గత నాలుగు నెలల్లో ఇప్పటికి ఇద్దరు సీఎంలు మారారు. పార్టీలో అసమ్మతి సెగ తో ఈ ఏడాది మార్చిలో త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రిగా వైదొలిగారు. ఆ తర్వాత మార్చి 10న ప్రస్తుతం ఎంపీగా ఉన్న తీరథ్ సింగ్ రావత్ సీఎంగా ప్రమాణం చేశారు.

తీరథ్ సింగ్ రావత్ రాజీనామాకు కారణాలివే

తీరథ్ సింగ్ రావత్ రాజీనామాకు కారణాలివే


ఆయన సిఎం పీఠంపై కొనసాగాలంటే సెప్టెంబర్ 10 లోపు అసెంబ్లీకి ఎన్నిక కావలసిన పరిస్థితి నెలకొంది. తీరథ్ సింగ్ రావత్ గంగోత్రి, హల్ద్వానీ స్థానాల్లో ఏదో ఒక దాని నుంచి ఆయన ఉపఎన్నికల బరిలో దిగుతారని తొలుత అంచనాలు వేసినప్పటికీ అందుకు భిన్నంగా ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.అయితే అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది మార్చి తోనే ముగియనున్న నేపథ్యంలో కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకపోవడంతో ఎన్నికల సంఘ ఉప ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేని కారణాలతోపాటు గా, తీరథ్ సింగ్ రావత్ సీఎం అయిన తర్వాత పలు వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ అధిష్టానానికి తలనొప్పులు తెచ్చి పెట్టడం వంటి కారణాలు సిఎం మార్పు వైపు మొగ్గు చూపేలా చేశాయి.

అనేక వివాదాల్లో తీరథ్ .. తాజాగా ఆయన స్థానంలో పుష్కర్ సింగ్ ధామి

అనేక వివాదాల్లో తీరథ్ .. తాజాగా ఆయన స్థానంలో పుష్కర్ సింగ్ ధామి

రాజ్యాంగ సంక్షోభం కారణంగా, నేను రాజీనామా చేయడం సరైనదని నేను భావించాను. కోవిడ్-19 కారణంగా బై-పోల్స్ నిర్వహించలేము అని నిన్న ఒక సంక్షిప్త ప్రకటనలో పేర్కొని ఆయన రాజీనామా చేశారు.
తీరథ్ సింగ్ రావత్ 114 రోజుల సీఎం పాలనలో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి . ఆయన చేసిన కొన్ని ప్రకటనలపై ప్రజల అసహనం గురించి బిజెపి ఉత్తరాఖండ్ నాయకులు ఢిల్లీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. సీఎం తీరథ్ సింగ్ రావత్ తన ముందున్న విధాన నిర్ణయాలను విమర్శించడం ద్వారా తన పార్టీని ఇబ్బంది పెట్టారు. దీంతో ప్రస్తుతం ఆయన స్థానంలో పుష్కర్ సింగ్ ధామి సీఎం కానున్నారు.

English summary
Pushkar Singh Dhami was today chosen by the Uttarakhand BJP legislative party to be the eleventh Chief Minister of the state. The change of guard came a day after Tirat Singh Rawat resigned from the post amid infighting and fading chances of his getting elected to the state Legislative Assembly by September 10.The name of Mr Dhami, considered close to Union Defence Minister Rajnath Singh, was declared today after the 57 Uttarakhand BJP MLAs met today at the party headquarters in capital Dehradun. The 45-year-old, a two-time-MLA, represents the Khatima constituency. He was an Officer on Special Duty to former Uttarakhand Chief Minister Bhagat Singh Koshiyari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X