పుష్పా-2 ట్రైలర్ లాంచ్ ..ప్రేక్షకులపై పోలీసుల లాఠీఛార్జ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పా-2 ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. బీహార్ రాష్ట్రం పాట్నాలో పుష్పా-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీగా అభిమానులు గాంధీ మైదాన్‌కు చేరుకున్నారు. ఈ ఈవెంట్‌కు దాదాపు 2 లక్షల మంది హాజరయ్యారు.అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈవెంట్ జరుగుతున్న సమయంలో పోలీసులపై కొందరు ప్రేక్షకులు చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత సీరియస్‌గా చెప్పినా వినకపోవడంతో లాఠీలకు పని చెప్పారు.
పుష్పా-2 ఈవెంట్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1200 పోలీసులతో సెక్యూరిటీ కల్పించారు. అయితే అల్లు అర్జున్, రష్మికను చూసేందుకు ప్రేక్షకులు ఒక్కసారిగా ఎడబడ్డారు. దీంతో పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కొందరు ఆకతాయిలు పోలీసులపై చెప్పులు విసిరారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పరిస్థితిని పోలీసులు అదుపు చేశారు.

ఇక పుష్ప -2 టైలర్ అందర్ని ఆకట్టుకుంది. 2:48 సెకన్ల నిడివి గల ట్రైలర్ ఇరగదీసింది. మాస్ ప్రేక్షకులకు ట్రైలర్ పునకాలు తెప్పిస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ అదరగొట్టాడని ట్రైలర్‌ను చూస్తే అర్ధం అవుతోంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ ట్రైలర్ చివర్లో వచ్చిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. ఇక పుష్ప అంటే నేషనల్ కాదు..ఇంటర్నేషనల్ అంటూ చెప్పే డైలాగ్ సైతం ఆకట్టుకుంది. మాస్ ర్యాంపేజ్‌తో ట్రైలర్ అదరగొట్టింది.
పుష్ప-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చెప్పులు విసిరిన ప్రేక్షకులపై పోలీసుల లాఠీఛార్జ్
— Telugu Scribe (@TeluguScribe) November 17, 2024
పాట్నా - గాంధీ స్టేడియంలో జరుగుతోన్న 'పుష్ప -2' ట్రైలర్ ఈవెంట్‌లో ట్రైలర్ విడుదలకు ముందు కొందరు పోలీసులపైకి చెప్పులు విసిరారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ప్రేక్షకులపై లాఠీఛార్జ్ చేశారు. pic.twitter.com/5rkHxjH44c
ట్రైలర్ అందర్ని ఆకట్టుకునేలా కట్ చేయడంలో సుకుమార్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ట్రైలర్‌లో సుక్కు మార్క్ కనిపిస్తోంది. మొదటి పార్ట్‌లో చివర్లో కనిపించిన ఫహద్ ఫాసిల్ , రెండో పార్ట్‌లో మాత్రం ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. మొదటి పార్ట్‌లో పుష్ప లవర్‌గా కనిపించిన రష్మికా మండన్న, రెండో పార్ట్‌లో ఆయన భార్యగా కనిపించనున్నారు. ఇక రెండో పార్ట్‌లో జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రూ. 400 వందల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications