పీవీకి స్మారకం: మోడీకి కితాబు, సోనియాపై ఫ్యామిలీ అప్‌సెట్
హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావుకు ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పీవీ అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తున్నారు.
ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చిన, మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు నడిపిన ఘనత పీవీ సొంతం. ఇలాంటి పీవీని కాంగ్రెస్ పార్టీ విస్మరించారనే విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మోడీ ప్రభుత్వం పీవీకి ఢిల్లీలో స్మారక స్థూపం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
దీనిపై పీవీ తనయులు పీవీ రాజేశ్వర రావు, పీవీ ప్రభాకర రావు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పీవీ అభిమానులు కూడా మోడీ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం యమునా నది ఒడ్డున పీవీ మెమోరియల్ నిర్మించనుంది.

ప్రధాని మోడీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు పీవీ స్మారక స్థూపం విషయమై పలుమార్లు డిమాండ్ చేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం దానిని నెరవేర్చడం సంతోషమని చెబుతున్నారు.
పీవీ నర్సింహా రావు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో హామీ ఇచ్చిందని, కానీ, పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ దానిని నెరవేర్చలేదని విమర్శిస్తున్నారు. ఈ పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఈ విషయం విస్మరించారని మండిపడుతున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications