వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీవీని రజనీకాంత్ కలిశారా?, మోడీకి మనవడి కితాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం నాటి ప్రధాని పీవీ నరసింహా రావును కలిశారా? కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని చెప్పారా? అంటే అవుననే అంటున్నారట పీవీ మనవడు ఎన్వీ సుభాష్! రజనీ తన తాతయ్యను కలిశారని ఆయన చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సుభాష్ బీజేపీలో ఉన్నారు.

1996 ఎన్నికలకు ముందు పీవీని రజనీ రెండు సార్లు కలిశారని సుధీర్ చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తానని చెప్పారని తెలిపారు. అయితే, రజనీకాంత్ ఆరంగేట్రం పైన తమిళనాడుకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పీవీ మిన్నకుండిపోయారని చెప్పారు. రజనీ కోసం పీవీ ప్రయత్నించారన్నారు.

1996 ఎన్నికల సమయంలో రజనీ తాతయ్యను రెండుసార్లు కలిశారని చెప్పారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే తాను ప్రచారం చేస్తానని రజనీ చెప్పారని, రెండోసారి కలిసినప్పుడు.. తాను టెలివిజన్ ద్వారా ప్రచారం చేస్తానని చెప్పారని తెలిపారు.

అయితే, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో ఓ వైపు చర్చలు జరుగుతుండగానే రజనీకాంత్ అమెరికా వెళ్లి పోయారని, తమిళ కాంగ్రెస్ నేతలు రజనీ ఆరంగేట్రాన్ని అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో రజనీకాంత్ మద్దతు విషయంలో అనుమానాలు రేకెత్తేలా చేశారని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. కొంతమంది నేతలు ఆయనను ప్రభావితం చేశారని అభిప్రాయపడ్డారు.

రజనీకాంత్

రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు కోసం లేదా ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు ఎప్పుడు రాజకీయ పార్టీలు ఎదురు చూస్తుంటాయి.

 రజనీకాంత్

రజనీకాంత్

తమిళనాడులో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజే వేరు. ఈ నేపథ్యంలో ఆయన కోసం రాజకీయ పార్టీలు పోటీ పడుతుంటాయి.

 రజనీకాంత్

రజనీకాంత్

దివంగత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీవీ నరసింహా రావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయనను రెండుసార్లు కలిశారట.

 రజనీకాంత్

రజనీకాంత్

తమిళనాడులో ఎన్నికలు జరిగే సమయాల్లో ఆయా పార్టీలు రజనీకాంత్ మద్దతు కోసం అర్రులు చాస్తుంటాయి. ఆయన మద్దతు పలికితే ఆ పార్టీ గెలుస్తుందనే అభిప్రాయం ఉంది.

 రజనీకాంత్

రజనీకాంత్

రజనీకాంత్ భారతీయ జనతా పార్టీలో చేరుతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. అంతలోనే ఆయన ఇటీవల జయలలితకు లేఖ రాయటం చర్చకు దారి తీసింది.

 రజనీకాంత్

రజనీకాంత్

ఇటీవలి సార్వత్రిక ఎన్నికలకు ముందు రజనీకాంత్‌ను ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిశారు. రజనీ ఇంటికి వెళ్లి ఆయన కలిశారు. అది చర్చనీయాంశమైంది.

 రజనీకాంత్

రజనీకాంత్

ఇటీవలి సార్వత్రిక ఎన్నికలకు ముందు రజనీకాంత్‌ను ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిశారు. రజనీ ఇంటికి వెళ్లి ఆయన కలిశారు. అది చర్చనీయాంశమైంది. రజనీ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు చెలరేగాయి.

 రజనీకాంత్

రజనీకాంత్

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీజేపీ రాష్ట్రాల పైన దృష్టి పెట్టింది. అందులో భాగంగా తమిళనాడులో రజనీకాంత్‌ను పార్టీలోకి తీసుకునేందుకు ఉవ్వీళ్లూరుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

 రజనీకాంత్

రజనీకాంత్

దివంగత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీవీ నరసింహా రావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయనను రెండుసార్లు కలిశారట.

 రజనీకాంత్

రజనీకాంత్

రజనీకాంత్ భారతీయ జనతా పార్టీలో చేరుతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. అంతలోనే ఆయన ఇటీవల జయలలితకు లేఖ రాయటం చర్చకు దారి తీసింది.

 రజనీకాంత్

రజనీకాంత్

రజనీకాంత్ భారతీయ జనతా పార్టీలో చేరుతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. అంతలోనే ఆయన ఇటీవల జయలలితకు లేఖ రాయటం చర్చకు దారి తీసింది.

 రజనీకాంత్

రజనీకాంత్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు నుండి విడుదలయ్యాక రజనీకాంత్ లేఖ రాయడంతో బీజేపీ యూ టర్న్ తీసుకుంది.

రజనీకాంత్

రజనీకాంత్

తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఉందని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. జయలలిత కోర్టు కేసుల్లో, డీఎంకే ప్రభావితం చేసే స్థాయిలో ఉండక పోవడంతో రజనీ కోసం బీజేపీ ప్రయత్నాలు చేసింది.

 రజనీకాంత్

రజనీకాంత్

రజనీకాంత్ రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉంటున్నారు. అయితే, ఆయన జయలలిత, నరేంద్ర మోడీ, కరుణానిధి వంటి వారిని అప్పుడప్పుడు కలవడం చర్చనీయాంశమవుతోంది.

1996లో కాంగ్రెస్ పార్టీ ఏఐఏడీఎంకే పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుందని అతను చెప్పారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ముక్కలైందన్నారు. జీకే ముపనార్ తమిళ మనిల కాంగ్రెస్ పార్టీని స్థాపించారని, డీఎంకేతో కలిసిపోయారని తెలిపారు.

తెలంగాణ నుండి ఎదిగిన అతిపెద్ద కాంగ్రెస్ నేత పీవీ నర్సింహా రావు అన్నారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ గుర్తించలేక పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం పీవీని గుర్తించారన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో ఆయన పీవీని గుర్తు చేసుకున్నారన్నారు. కాగా, సుభాష్ పీవీ కూతురు తనయుడు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.

English summary
The former prime minister's grandson, now with BJP says, the superstar met his grandfather twice in the run-up to the 1996 elections and said he would campaign for the Congress if it went alone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X