'యోగి ఆదిత్యనాథ్! ఆ హామీ ఏమయింది, రాజీనామా చెయ్'

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించలేకుంటే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని యూపీ కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ డిమాండ్ చేశారు.

లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేయకుంటే ఆయన ముఖ్యమంత్రి పదవిని వేరే వారికి అప్పగించాలని చెప్పారు. ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ శాంతిభద్రతల అంశాన్ని ప్రస్తావించిందని గుర్తు చేశారు.

ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు

ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు

తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంచుతామని చెప్పారని, కానీ ఇప్పుడు ఆ హామీ ఏమయిందని రాజ్ బబ్బర్ ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు అదుపులో లేవన్నారు.

యోగి వద్ద ఏం ప్లాన్లు ఉన్నాయి

యోగి వద్ద ఏం ప్లాన్లు ఉన్నాయి

మరోవైపు, రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వద్ద ఏం ప్రణాళికలు ఉన్నాయో చెప్పాలని బీఎస్పీ డిమాండ్ చేసింది.

మహిళలు రాత్రి తిరగొచ్చంటున్నారు కానీ..

మహిళలు రాత్రి తిరగొచ్చంటున్నారు కానీ..

ప్రకటనలు తప్పితే, నేరాలను తగ్గించడం లేదని బీఎస్పీ నేత లాల్జీ వర్మ అన్నారు. రాత్రి పన్నెండు గంటల వరకు నిరభ్యంతరంగా మహిళలు తిరగవచ్చునని ప్రభుత్వం చెబుతోందని, కానీ అత్యాచారాలు మాత్రం పెరిగాయన్నారు.

యోగి నియోజకవర్గంలోనే..

యోగి నియోజకవర్గంలోనే..

స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గమైన గోరక్‌పూర్‌లో ఇప్పటి వరకు 18 పెద్ద నేరాలు చోటు చేసుకున్నాయని వర్మ చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Back in public domain after a long time since Congress's humiliating defeat, state party president, Raj Babbar, on Thursday asked chief minister Yogi Adityanath to resign if he cannot control the law and order situation in UP.
Please Wait while comments are loading...