అంబానీకి రూ.30వేల కోట్లు! ‘రాఫెల్’తో మోడీకి నిద్రపట్టడం లేదు: రాహుల్ సెటైర్లు
న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంలో విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్‌కామ్ అధినేత అనిల్ అంబానీలపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. అది(రాఫెల్ ఒప్పందం).. ప్రధాని మోడీ-అనిల్ అంబానీ ఒప్పందం అని ధ్వజమెత్తారు.

నష్టాల్లో అంబానీకి కంపెనీతో ఢీల్ ఎలా?
నష్టాల్లో ఉన్న అనిల్ అంబానీ కంపెనీలో డసాల్ట్(డసో) కంపెనీ రూ.284కోట్లను ఎలా పెట్టుబడిగా పెట్టిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. డసాల్ట్ చెల్లించిన ఆ మొత్తంతోనే అనిల్ అంబానీ భూమి కొన్నారని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే డసాల్ట్ సీఈఓ అబద్ధాలు చెబుతున్నారని అర్థమవుతోందని రాహుల్ గాంధీ చెప్పారు.

అంబానీ కంపెనీకి రూ.30వేల కోట్లు
అవినీతి జరిగిన కారణంగానే మోడీ ఈ ఒప్పందంపై విచారణ కూడా చేయించడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. అనిల్ అంబానీకి రూ.30వేల కోట్లు కట్టబెట్టేందుకే నరేంద్ర మోడీ ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు.

మోడీకి నిద్ర పట్టడం లేదు
రాఫెల్ ఒప్పందంపై విచారణ జరిపిస్తే కుంభకోణం ఎక్కడ బయటపడుతుందోనని ప్రధాని నరేంద్ర మోడీ రాత్రిళ్లు నిద్ర కూడా పోవడం లేదని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

డసాల్ట్ డబ్బుతోనే అంబానీ భూమి కొనుగోలు
అనిల్ అంబానీకి లాండ్(భూమి) ఉన్నందునే వారితో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామని, హెచ్ఏఎల్‌కు భూమి లేని కారణంగానే ఎంపిక చేసుకోలేదని డసాల్ట్ సీఈఓ చెప్పారని రాహుల్ గాంధీ తెలిపారు. అయితే, ఇక్కడ జరిగిందేమంటే.. డసాల్ట్ కంపెనీ ఇచ్చిన డబ్బులతోనే అనిల్ అంబానీ భూమి కొన్నారని రాహుల్ గాంధీ చెప్పారు.












Click it and Unblock the Notifications