ఎంపీ రఘురామకు భారీ షాక్: వైసీపీ అనర్హత ఫిర్యాదుపై లోక్‌సభ సెక్రటేరియట్ నోటీసులు -15 రోజుల్లోగా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకే చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మధ్య గత రెండేళ్లుగా కొనసాగుతోన్న యుద్ధం ముగింపు దశకు వచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామపై అనర్హతవేటు వేయాల్సిందిగా వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఎట్టకేలకు చర్యలకు దిగారు..
Recommended Video
అధినేత జగన్ ను పదే పదే ధిక్కరిస్తూ, పార్లమెంటులో పార్టీ లైన్ కు విరుద్దంగా వ్యవహరిస్తోన్న రఘుమపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని, అతణ్ని ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని వైసీపీ దాదాపు రెండేళ్లుగా స్పీకర్ ఓం బిర్లాను అభ్యర్థిస్తూ రావడం తెలిసిందే. ఈ వ్యవహారంలో తొలిసారి రెబల్ ఎంపీకి నోటీసులు జారీ అయ్యాయి.

ఫిరాయింపుల చట్టం కింద వైసీపీ చేసిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలంటూ ఎంపీ రఘురామకు లోక్ సభ సెక్రటేరియట్ గురువారం నాడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఈ షోకాజ్ నోటీసులకు ఎంపీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని లోక్ సభ సెక్రటేరియట్ పేర్కొంది. ఫిరాయింపు వ్యవహారంలో ఇరుపక్షాల వాదనలూ విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ఓం బిర్లా ఇటీవలే చెప్పిన విధంగా ఇప్పుడు లోక్ సభ సెక్రటేరియట్ ఎంపీ వివరణ కోరింది. కాగా,
అనర్హత వేటు వ్యవహారానికి సంబంధించి వైసీపీ రెబల్ రఘురామకృష్ణంరాజుతోపాటు బెంగాల్ కు చెందిన మరో ఇద్దరు ఎంపీలకు సైతం షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. బెంగాల్ ఎంపీలు శిశిర్ అధికారి, సునిల్ కుమార్ మండల్ టీఎంసీ నుంచి గెలుపొంది, ఆ తర్వాత బీజేపీలోకి ఫిరాయించారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలన్న టీఎంసీ ఫిర్యాదు మేరకు ఇవాళ లోక్ సభ సెక్రటేరియట్ నోలీసులు జారీ చేసింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications