వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ల రద్దును నేను సమర్థించలేదు: రఘురామ్ రాజన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:పెద్ద నోట్ల రద్దును తానెప్పుడూ సమర్థించలేదని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలోని 86 శాతం కరెన్సీని ఒక్క మాటతో రద్దు చేయడం వల్ల కలిగే తీవ్ర పరిణామాల గురించి తాను ప్రభుత్వాన్ని హెచ్చరించానని రాజన్ బాంబు పేల్చారు.

దేశంలో నల్లధనం నిర్మూలనకు గాను కేంద్ర ప్రభుత్వం పెద్డనోట్ల రద్దును ప్రవేశపెట్టింది. అయితే ఈ పెద్ద నోట్ల రద్దు పెద్దగా ఫలితం ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ విషయమై విపక్షాలు ప్రభుత్వతీరును ఎండగడుతున్నాయి.

నోట్ల రద్దుపై మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించా, పట్టించుకోలేదు: రఘురాం రాజన్నోట్ల రద్దుపై మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించా, పట్టించుకోలేదు: రఘురాం రాజన్

500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేయడానికి సంబంధించి 2016 ఫిబ్రవరిలో తన అభిప్రాయాలు తెలియజేయమని ప్రభుత్వం కోరినట్టు రాజన్‌ తన పుస్తకం 'ఐ డు వాట్‌ ఐ డు'లో పేర్కొన్నారు. ఈ పుస్తకంలో తాను గవర్నర్‌గా ఉన్నప్పుడు చోటు చేసుకున్న పరిణామాల గురించి రాజన్‌ వివరించారు.

Raghuram Rajan says demonetisation not an economic success, poor sections hit hard

2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టిన రాజన్‌ 2013 సెప్టెంబర్‌ 4వ తేదీ నుంచి 2016 సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు ఆర్‌బిఐ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన పదవీ కాలం ముగిసిన తర్వాత నవంబర్‌ 8వ తేదీన 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

నోట్ల రద్దుకు పూర్వం తాను ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనను రాజన్‌ తన పుస్తకంలో వివరించారు. 'నోట్ల రద్దు గురించి అభిప్రాయం తెలియజేయాలని ప్రభుత్వం నన్ను 20016 ఫిబ్రవరిలో కోరింది. దీనికి నేను నోటిమాటగా అభిప్రాయం తెలియజేశా. నోట్ల రద్దుతో దీర్ఘకాలంలో ప్రయోజనం ఉండవచ్చని, అయితే స్వల్పకాలంలో ఈ ప్రయోజనాలను మించిన ప్రభావం ఉంటుందని చెప్పానని రాజన్ ఆ పుస్తకంలో వివరించారు.

ప్రధాన లక్ష్యాలను సాధించేందుకు చాలా మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని స్పష్టంగా తెలియజేశానని అని రాజన్‌ తన పుస్తకంలో రాశారు. నోట్ల రద్దు కారణంగా చోటు చేసుకునే పరిణామాలు, ప్రయోజనాలు, నిర్దేశిత లక్ష్యానికి ప్రత్యామ్నాయంగా ఉన్న అంశాలతో కూడిన ఒక నోట్‌ను ప్రభుత్వానికి అందజేశానని పేర్కొన్నారు.

నోట్ల రద్దుకు సన్నద్ధత అవసరమని, ఇందుకు తగినంత సమయం అవసరమని సూచించినట్టు చెప్పారు. తగిన విధంగా సన్నద్ధంకాకపోతే చోటు చేసుకునే పరిణామాల గురించి కూడా తెలియజేసినట్టు ఆయ న తెలిపారు. ఈ అంశాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, సమావేశాలకు కరెన్సీ ఇన్‌చార్జ్‌గా ఉన్న డిప్యూటీ గవర్నర్‌ హాజరయ్యారని చెప్పారు.

రాజన్‌ తన పదవి నుంచి తప్పుకున్న రెండు నెలల తర్వాత ప్రభుత్వం 15.44 లక్షల కోట్ల రూపాయల విలువైన 500, 1,000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు కారణంగా మూటింట ఒక వంతు మాత్రమే వెనక్కి వస్తుందని భావించారు.

English summary
Former RBI governor Raghuram Rajan has said that demonetisation at this point is not an economic success as the costs associated with the exercise has been substantial while GDP has taken a hit. Even the progress in the digitisation of the economy "has come back to broadly the trend growth line",
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X