గుజరాతీ రచయిత రఘువీర్‌కు జ్ఞానపీఠ్
న్యూఢిల్లీ: సాహిత్యం దేశంలోని అత్యున్న సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్ అవార్డు ఈ ఏడాదికి ప్రముఖ గుజరాతీ రచయిత రఘువీర్ చౌదరిని వరించింది. 2015 సంవత్సరానికి గాను ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైనవారిలో రఘువీర్ చౌదరి 51వ వారు.
ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ సెలక్షన్ బోర్డు చైర్మన్ సురంజన్ దాస్ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన బోర్డు ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. రఘువీర్ చౌదరి గుజరాతీలో పలు రచనలు చేశారు. రఘువీర్ చౌదరి గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు.

1938లో జన్మించిన రఘువీర్ చౌదరికి గుజరాతీ సాహిత్యంలో విశిష్టమైన స్థానం ఉంది. నవలాకారుడిగా, కవిగా, విమర్సకుడిగా గుజరాతీ సాహిత్యంలో ఆయన తనదైన ముద్ర వేశారు. గంభీరమైన భావవ్యక్తీకరణ, అర్థవంతమైన ఉపమలు, ప్రతీకలు రఘువీర్ కవిత్వానికి వన్నె తెచ్చాయి. కవిత్వమే ఆయనకు అత్యంత ఇష్టమైన ప్రక్రియ.
అయితే నవలా సాహిత్యంలోనూ ఆయన కృషి చేశారు. ఆయన రాసిన అమృత, వేణు వత్సల, ఉపర్వస్ నవలల్లో ఆయన ప్రగతిశీల దృక్పథం కనిపిస్తుంది. ఆయన రాసిన రుద్ర మహాలయ గుజరాతీ సాహిత్యంలో ప్రశస్థమైన రచనగా నిలిచింది.












Click it and Unblock the Notifications