Rahul Gandhi: మోడీని ట్రంప్ ఎలా భయపెట్టారంటే ? గుట్టు విప్పిన రాహుల్..!

భారత్- అమెరికా మధ్య తాజాగా హఠాత్తుగా కుదిరిన వాణిజ్య ఒప్పందంపై లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (rahul gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరీ ఈ ఒప్పందం చేసుకున్నారంటూ ప్రధాని మోడీపై రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై రాహుల్ మాట్లాడకుండా బీజేపీ సభ్యులు తీవ్ర ఆటంకాలు సృష్టించారు. దీంతో సభ వాయిదా పడింది. అనంతరం బయటికి వచ్చిన రాహుల్ మాట్లాడారు.

ప్రధాని మోడీ భయపడుతున్నారని, అమెరికాతో వాణిజ్య ఒప్పందం నాలుగు నెలలుగా నిలిచిపోయి ఉందని, కానీ ఇవాళ ఎలాంటి కారణం లేకుండానే డీల్ జరిగిపోయిందన్నారు. మోడీ నిన్న సాయంత్రం ఈ డీల్ పై సంతకం చేశారని గుర్తుచేశారు. ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. మోడీకి ఇమేజ్ పోతుందనే భయం పట్టుకుందన్నారు. మాజీ ఆర్మీ ఛీఫ్ నరవణే పుస్తకంలో అంశాల పేరుతో తనను అడ్డుకున్నారని, కానీ ఇది అసలు విషయం కాదన్నారు.

Rahul Gandhi Alleges PM Modi Compromised Signed Fearful US Deal with Trump

ఇది ప్రజలు గమనించాలన్నారు. లోక్ సభలో విపక్ష నేతను రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పకుండా తొలిసారి అడ్డుకున్నారన్నారు. ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా మన దేశంలో రైతుల రక్తం, శ్రమను ప్రధాని మోడీ అమ్ముకున్నారన్నారు. వారితో పాటు దేశాన్ని కూడా అమ్మేశారన్నారు. మోడీ భయపడుతున్నారని, ఎందుకంటే ఆయనకు ఈ ఇమేజ్ తెచ్చినవారే దాన్ని చెడగొడుతున్నారన్నారు. అమెరికా ప్రభుత్వం అదానీనీ టార్గెట్ చేయడం లేదని, మోడీ ఆర్ధిక బలాన్ని టార్గెట్ చేస్తోందన్నారు. అలాగే ఎప్ స్టీన్ ఫైల్స్ ద్వారా మోడీని టార్గెట్ చేస్తున్నారన్నారు. ఎప్ స్టీన్ ఫైల్స్ ను అమెరికా ఇంకా విడుదల చేయలేదన్నారు. ఈ రెండు అంశాలు ప్రధాని మోడీ రాజీపడ్డారనే దానికి నిదర్శనం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+