నన్నే ఆపుతారా?: కారు దిగి ఆవేశంతో ఊగిపోయిన రాహుల్ గాంధీ
మధ్య ప్రదేశ్‌లోని మాండ్‌సోర్ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతులను కలుసుకునేందుకు కారులో వెళ్తున్న సమయంలో రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను పోలీసులు మధ్యప్రదేశ్-రాజస్థాన్ సరిహద్దులో ఆపేశారు.
భోపాల్: మధ్య ప్రదేశ్‌లోని మాండ్‌సోర్ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతులను కలుసుకునేందుకు కారులో వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను పోలీసులు మధ్యప్రదేశ్-రాజస్థాన్ సరిహద్దులో ఆపేశారు.
దీంతో రాహుల్ గాంధీ ఆవేశంగా కారు దిగారు. మీడియా ప్రతినిధులు, పోలీసులను తోసేసుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లబోయారు. ఆ సమయంలో రాహుల్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నన్ను ఎలా ఆపుతారంటూ నిలదీశారు. కోపంగా నడుచుకుంటూ వెళ్లిపోయిన రాహుల్ బైక్ పైన బయలుదేరారు. ఆ ప్రయత్నాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు.

దీనిని అడ్డుకోవడంతో నడిచి కొద్ది దూరం వెళ్లారు. అనంతరం అతనిని పోలీసులు అరెస్టు చేశారు. శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తూ సెక్షన్ 144ను ఉల్లంఘించినందుకు రాహుల్‌ను అరెస్టు చేసినట్లు అడిషనల్ డీజీపీ వి మధుకుమార్ తెలిపారు.
రాహుల్, శరద్‌యాదవ్, కమల్‌నాథ్, సచిన్‌పైలెట్, గిరిజా వ్యాస్ ఇతర నేతలను అరెస్టు చేసి విక్రం సిమెంట్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్‌కు తరలించారు. ఆ తర్వాత నాలుగు గంటలకు ఆయనను విడుదల చేశారు. కాగా, ఆ తర్వాత చనిపోయిన రైతు కుటుంబాలను రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ - రాజస్థాన్ సరిహద్దుల్లో కలవనున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications