అహ్మదాబాద్: జిఎస్టీ అంటే గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని ప్రధాని నరేంద్ర మోడీ భాష్యం చెబితే, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మరో రకంగా చెప్పారు.
జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ టాక్స్ అని చురకలంటించారు. గుజరాత్‌లో ఎన్నికల నేపథ్యంలో రాహుల్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు.

ప్రధాని మోడీ చేసిన నోట్ల రద్దు దారుణంగా విఫలమైందన్నారు. మరోవైపు మేకిన్ ఇండియా కూడా విఫలమైందన్నారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడు జయ్‌షాపై ఓ వార్తా వెబ్‌సైట్ ప్రచురించిన అక్రమాస్తుల ఆరోపణ కథనంపై స్పందించారు.
బిజెపి సామాన్యులకు చదువును అందకుండా చేసిందన్నారు. ఎందుకంటే కళాశాలలను, యూనివర్సిటీలను ప్రభుత్వం పారిశ్రామికవేత్తల చేతిలో పెట్టిందన్నారు. గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించాలని రాహుల్ ఈసీని డిమాండ్ చేశారు.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!