రాహుల్ పుట్టి పెరిగింది ఇక్కడే : ప్రియాంక గాంధీ
అమేథీ : రాహుల్ గాంధీ పౌరసత్వంపై కేంద్ర హోం శాఖ నోటీసులు జారీ చేయడంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ అమేథీలో ప్రచారం నిర్వహిస్తున్న ఆమె.. కేంద్రం నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ భారతీయుడనే విషయం దేశం మొత్తానికి తెలుసన్న ప్రియాంక.. ఆయన ఇక్కడే పుట్టి పెరిగిన విషయాన్ని గుర్తుచేశారు. రాహుల్‌పై కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు.
బ్రిటన్ పౌరసత్వం కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి కేంద్ర హోం శాఖ నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఫిర్యాదుపై స్పందించి వివరణ కోరింది. 15లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.













Click it and Unblock the Notifications