అగ్నిపథ్ వెనక్కు తీసుకోవాల్సిందే - రాహుల్ డిమాండ్ : దేశవ్యాప్త ఆందోళనలకు నిర్ణయం..!!
దేశ వ్యాప్తంగా నిరసనలకు..ఆందోళనలు...విధ్వంసాలకు కారణమవుతున్న అగ్నిపథ్ పై రాహుల్ గాంధీ కీలక డిమాండ్ చేసారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరిచుకోవాలని కోరారు. రైతుల సుదీర్ఘ నిరసనల అనంతరం సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయాన్ని ప్రస్తావించిన రాహుల్...ఆ తరహాలోనే ఇప్పుడు అగ్నిపథ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. మోదీ 'మాఫీవీర్'గా మారి.. యువత డిమాండ్‌కు తలొగ్గుతారంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఇదే అంశం పైన దేశ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది.
దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం సత్యాగ్రహ దీక్షకు నిర్ణయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ప్రధాని దేశ యువత నిర్ణయాన్నీ అంగీకరించాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఎనిమదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం జై కిసాన్...జై జవాన్ విలువలను అవమానించేలా వ్యవహరించిందని ఆరోపించారు. గతంలో రైతు చట్టాలను ప్రధాని రద్దు చేసుకుంటారని తాను చెప్పానని.. ఇప్పుడు అగ్నిపథ్ నిర్ణయం అదే తరహాలో ఉంటుందని రాహుల్ చెప్పుకొచ్చారు.

'అగ్నిపథ్' పై ఆదివారం దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అన్ని పీసీసీలను ఆదేశించింది. దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. యువకులకు సంఘీభావంగా కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు.. ఆదివారం ఉదయం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం చేయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీలు, కార్యవర్గ సభ్యులు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇక, ఇదే సమయంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో సమావేశం అయ్యారు, ఈ స్కీం పైన చర్చలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక మినహాయింపులు ఇచ్చినా.. ఉద్రిక్తతలు తగ్గకపోవటంతో ఏం చేయాలనే దాని పైన తర్జన భర్జన పడుతున్నారు. మరో వైపు అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications