అందుకే గుజరాత్‌లో రాహుల్ గాంధీ కారుపై దాడి: రాజ్‌నాథ్
ఇటీవల గుజరాత్‌లో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కాన్వాయ్‌పై రాళ్ల దాడి మీద లోకసభలో మంగళవారం కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. దీనిపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు.
న్యూఢిల్లీ: ఇటీవల గుజరాత్‌లో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కాన్వాయ్‌పై రాళ్ల దాడి మీద లోకసభలో మంగళవారం కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. దీనిపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు.
ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం విచారణ జరుపుతోందని, ఇప్పటికే ఒకరిని అరెస్టు చేసినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. రాహుల్ ఎస్పీజీ పోలీసుల భద్రత లేకుండా ఇప్పటికి ఆరుసార్లు దేశం విడిచి వెళ్లారని, పోలీసుల సలహాలు పాటించడం లేదన్నారు.
आपदा राहत या आपदा पर्यटन? विपक्ष में होने के बावजूद क्यों कांग्रेस को गुजरात में विरोध का सामना करना पड़ा है? https://t.co/f5p3lpORGt
— Rajnath Singh (@rajnathsingh) August 8, 2017
గుజరాత్ పర్యటనకు బుల్లెట్ ప్రూఫ్ కారులో ఎందుకువెళ్లలేదో చెప్పాలన్నారు. ఎస్పీజీని ఆయన ఎందుకు తిరస్కరిస్తున్నారో మాకు తెలియాలన్నారు.












Click it and Unblock the Notifications