వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణాదిపై రాహుల్ ఫోకస్-కలిసొస్తున్న పరిస్ధితులు-బీజేపీ బలహీనతలే అస్త్రాలు

|
Google Oneindia TeluguNews

2014 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే జాతీయ స్ధాయిలో తొలిసారి భారీ విజయం సొంత చేసుకున్నాక విపక్ష కాంగ్రెస్ తో పాటు దే్శంలో ఎవ్వరూ ఊహించని విధంగా కాషాయపార్టీ బలపడుతూ వస్తోంది. అప్పటివరకూ కేవలం ఓ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిదేముంది, మళ్లీ కోలుకోవచ్చని భావించిన కాంగ్రెస్ ను ఎక్కడికక్కడ అణచివేస్తూ బీజేపీ ముందుకు సాగుతోంది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉనికి కోల్పోయే పరిస్ధితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉత్తరాదితో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దక్షిణాదిలోనే కాస్తో కూస్తో ఆదరణ కనిపిస్తోంది. ఈ పరిస్ధితుల్ని సొమ్ము చేసుకునేందుకు రాహుల్ గాంధీ ఆలస్యంగానైనా ప్రయత్నాలు ప్రారంభించారు.

ప్రమాదంలో కాంగ్రెస్ ఉనికి

ప్రమాదంలో కాంగ్రెస్ ఉనికి

ఒకప్పుడు దేశవ్యాప్తంగా భారీ విజయాలతో దశాబ్దాలకు పైగా ఏకఛత్రాధిపత్యం సాగించిన కాంగ్రెస్ పార్టీకి ఎనిమిదేళ్లుగా గడ్డుకాలం నడుస్తోంది. ముఖ్యంగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక మొదలైన కాంగ్రెస్ ఓటముల పరంపర ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. జాతీయ స్ధాయిలో ఓటములు ఓ ఎత్తయితే రాష్ట్రాల్లోనూ వరుసగా అధికారం కోల్పోతూ వస్తున్న కాంగ్రెస్ తాజాగా పంజాబ్ ను కూడా చేజార్చుకుంది. దీంతో కేవలం రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ లో మాత్రమే ఇప్పుుడ ఆ పార్టీ అధికారంలో ఉంది. ఇదే పరిస్ధితి కొనసాగితే కాంగ్రెస్ జాతీయ పార్టీ హోదా కూడా ప్రమాదంలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.

ఉత్తరాదిలో బీజేపీ ఓట్ల పోలరైజేషన్

ఉత్తరాదిలో బీజేపీ ఓట్ల పోలరైజేషన్


వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ బలమంతా ఉత్తరాదిలోనే ఉండేది. దక్షిణాది రాష్ట్రాలు బోనస్ గా ఉండేవి. కానీ కొన్ని దశాబ్దాలుగా మారుతున్న పరిస్దితులు ఉత్తరాదిలో కాంగ్రెస్ బలాన్ని క్రమంగా కోల్పోయేలా చేశాయి. ముఖ్యంగా బీజేపీ మొదలుపెట్టిన హిందూత్వ రాజకీయాలు దేశంలో ముఖ్యంగా ఉత్తరాదిలో హిందువుల్ని ఆకట్టుకోవడం మొదలుపెట్టాయి. దీంతో సహజంగానే కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు కోల్పోవడం మొదలైంది. గతంలో 219 ఎన్నికల్లో చివరి సారిగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ ఏర్పాటులో అప్పటి ఉమ్మడి ఏపీ నుంచి ఇచ్చిన 31 ఎంపీ సీట్లు ఎంతో కీలకంగా మారాయి. రాష్ట్రవిభజనతో ఆ పరిస్ధితులు మళ్లీ రిపీటయ్యే అవకాశం లేకుండా పోయింది. దీంతో మళ్లీ కేంద్రంలో అధికారం కోసం దక్షిణాదినే నమ్ముకోవాల్సిన పరిస్ధితి కాంగ్రెస్ కు ఎదురవుతోంది.

దక్షిణాదిపై రాహుల్ ఫోకస్

దక్షిణాదిపై రాహుల్ ఫోకస్

ఉత్తరాదిలో మారుతున్నపరిస్ధితుల్ని త్వరగానే గ్రహించిన కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో యూపీలోని తమ సంప్రదాయసీటు అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అమేథీలో తొలిసారి నెహ్రూ కుటుంబ వారసుడు ఓడిపోయాడు. వయనాడ్ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ ఇప్పుడు దక్షిణాది నుంచి జాతీయస్ధాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యనేతగా మారిపోయారు. దీంతో రాహుల్ గాంధీ ఫోకస్ దక్షిణాదిపైనే ఉంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ఎన్నికల్లోనూ డీఎంకేతో కలిసి పోటీ చేసి పలు స్ధానాలు కైవసం చేసుకుంది. తెలంగాణలోనూ తిరిగి సత్తా చాటుకునేందుకు రాహుల్ ఇవాళ వరంగల్ కు వస్తున్నారు.

కలిసొస్తున్న దక్షిణాది రాజకీయం

కలిసొస్తున్న దక్షిణాది రాజకీయం

ఉత్తరాదిలో పదికి పైగా రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉన్న బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం కేవలం కర్నాటక మాత్రమే ఆదరిస్తోంది. మిగతా రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడులో బీజేపీ ప్రభావం నామమాత్రమే. ఈ మధ్య తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసిన కేసీఆర్ రాజకీయం ఇప్పుడు బీజేపీకి కలిసొస్తోంది. దీంతో తెలంగాణలో పట్టు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే కేరళ, ఒడిశా, తమిళనాడు, ఏపీలో ఎంత గట్టిగా ప్రయత్నించినా బీజేపీ కనీస ప్రభావం చూపలేని పరిస్ధితుల్లో ఉంది. ఈ రాష్ట్రాల్లో ఏపీ మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్ కాస్త ప్రయత్నిస్తే అధికారం దక్కించుకోలేకపోయినా గట్టి ప్రభావం మాత్రం చూపే అవకాశముంది. దీంతో దక్షిణాదిపై ఫోకస్ పెట్టడం ద్వారా ఢిల్లీకి దారులు వేసుకోవాలని రాహుల్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

English summary
congress leader is now focusing on southern states with detoroiting condition of congress party in northern states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X