Rahul Gandhi New Look : రాహుల్ గాంధీ న్యూ లుక్ చూశారా ? కేంబ్రిడ్స్ వర్శిటీలో ప్రత్యక్ష్యం..

భారత్ జోడో యాత్రలో పేదల కష్టాలు చూసి గడ్డం కూడా గీసుకోకుండానే నడిచిన రాహుల్ గాంధీ.. తాజాగా యాత్ర ముగియడంతో లుక్ మార్చారు.

దేశంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అయిన కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తాజాగా నాలుగు నెలల పాటు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ భారత్ జోడో యాత్ర పేరుతో నడిచారు. బీజేపీ విద్వేష విధానాలకు వ్యతిరేకంగా దేశాన్ని తిరిగి కలిపేందుకు ఆయన యాత్ర సాగించారు. ఈ యాత్రలో ప్రజల కష్టాలు చూసిన రాహుల్.. గడ్డం గీసుకోకుండా, ఎముకలు కొరికే చలిలోనూ టీషర్టులోనే నడిచారు. దీని వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు.

అయితే భారత్ జోడో యాత్రలో మార్క్సిస్ట్ గుబురు గడ్డంతోనే నడిచిన రాహుల్ గాంధీ.. తాజాగా యాత్ర ముగించారు. అనంతరం ఛత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలోనూ అలాగే కనిపించారు. ఇప్పుడు తాజాగా కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి వెళ్లిన రాహుల్.. తన గుబురు గడ్డానికి గుడ్ బై చెప్పారు. గడ్డాన్ని ట్రిమ్ చేయించుకుని దర్శనమిచ్చారు. దీంతో రాహుల్ కొత్త లుక్ ఇప్పుడు చూపరుల్ని ఆకర్షిస్తోంది.

rahul gandhi gandhi appeared with new look at cambridge university after jodo yatra

తన వారం రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్ చేరుకున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కొత్త అవతారంలో దర్శనమిస్తున్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో "21వ శతాబ్దంలో వినడం నేర్చుకోవడం " అనే అంశంపై రాహుల్ మాట్లాడారు. రాహుల్ తన ప్రసంగాన్ని ప్రారంభించేందుకు వచ్చినప్పుడు ఇలా ట్రిమ్ చేసుకున్న గడ్డంతో స్మార్ట్ గా కనిపించారు. అలాగే ఈ మధ్య రెగ్యులర్ గా ధరిస్తున్న తెల్లటి టీ-షర్టుకు బదులుగా సూట్-టైలో కనిపించారు. దీంతో రాహుల్ గాంధీ కొత్త లుక్‌కి సంబంధించిన ఫోటోలను పలువురు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+