లెక్కలు రావా: రాహుల్ గాంధీ ప్రశ్న రివర్స్, నెటిజన్ల సెటైర్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మరోసారి పొరపాటు చేశారు. ఆయన ట్విట్టర్‌లో చేసిన కామెంటుకు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

రాహుల్ గాంధీ స్ట్రాటేజీ టీం ఇదే: సచిన్ నుంచి రమ్య దాకా

పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరల గురించి ప్రస్తావిస్తూ ఓ పొరపాటు చేశారు. మీకు లెక్కలు రావా అంటూ ఆయనపై నెటిజన్లు జోకులు పేల్చారు.

Rahul Gandhi gets math wrong in question to BJP, corrects it later

2014 నుంచి 2017 వరకు నిత్యవసర సరకుల ధరలు ఎంత శాతానికి పెరిగాయో ఓ టేబుల్‌ ద్వారా రాహుల్ వివరించారు. అప్పటికీ ఇప్పటికీ పెరుగుద‌ల శాతం వివ‌రాలు త‌ప్పుగా పేర్కొన్నారు.

కందిపప్పు ధర కిలో రూ.45 నుంచి రూ.80కి పెరిగిందని వివరిస్తూ 77 శాతం ధర పెరిగిందని చెప్పాల్సింది పోయి 177 శాతం పెరిగిందన్నారు.

దాంతో గణితం కూడా రాని రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎలా అవుతారు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు గుప్పించారు. ఆ తర్వాత దానిని సరి చేసుకున్నారు. రాహుల్ గాంధీ బీజేపీకి రోజూ ప్రశ్నలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In today's edition of his 'question a day to the BJP' social media campaign, soon-to-be Congress president Rahul Gandhi got basic math wrong. Rahul today posted a tweet with a table that had wrong percentage numbers in it. He later deleted that tweet and posted a new one after fixing the numbers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి