వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమేధీ కి రాహుల్ గాంధీ గుడ్ బై..! కారణం అదేనా..!!??

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : ప్ర‌స్తుతం ఎన్నిక‌ల్లో రాహుల్‌గాంధీ రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. మొద‌టిది ఉత్త‌ర‌భార‌తదేశంలోని ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం రాజీవ్‌గాంధీ హ‌యాం నుంచి గాంధీల‌కు కంచుకోట‌గా ఉంది. 1999లో సోనియాగాధీ పోటీ చేయ‌గా 2004 నుంచి రాహుల్‌గాంధీ ఇక్క‌డి నుంచే పోటీ చేస్తున్నారు. తాజా ఎన్నిక‌ల‌లో కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ ద‌క్షిణ‌భార‌త‌దేశంపై అంతులేని వివ‌క్ష చూపుతోంద‌ని, అందుకే తాను ఇక్క‌డి నుంచి పోటీ చేసి ద‌క్షిణానికి అండ‌గా ఉన్నాన‌ని చెప్ప‌డానికే పోటీ చేస్తున్న‌ట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేస్తున్నారు.

 వాయనాడ్, అమేధీ నుండీ రాహుల్ పోటీ..! గెలిస్తే వాయనాడ్ కే పరిమితం..!!

వాయనాడ్, అమేధీ నుండీ రాహుల్ పోటీ..! గెలిస్తే వాయనాడ్ కే పరిమితం..!!

ఎన్నిక‌ల్లో ఈ రెండు స్థానాల్లో రాహుల్‌గాంధీ గెల‌వ‌డం దాదాపు ఖాయ‌మైంది. రెండు చోట్ల గెలిచిన‌ప్ప‌టికీ.. ఆయ‌న మాత్రం ఒకే నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం కావాలి. రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ప్రాతినిధ్యం వ‌హించ‌డానికి వీలుండ‌దు. ఏఐసీసీ నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. రాహుల్‌గాంధీ అమేథీని వ‌ద‌లుకోనున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఈ దిశ‌గా సంకేతాలు కూడా ఇచ్చారు.

 దక్షిణ భారతదేశంలో పార్టీ పటిష్టతకు క్రిషి..! అందుకే అమేథీకి దూరం..!!

దక్షిణ భారతదేశంలో పార్టీ పటిష్టతకు క్రిషి..! అందుకే అమేథీకి దూరం..!!

కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో ప‌ర్య‌టించిన‌ప్పుడు.. సీపీఐ కూట‌మి నేత‌లు రాహుల్‌గాంధీని స్థానికేత‌రుడిగా ప్ర‌చారం చేస్తూ.. ఆయ‌న గెలిచాక ఇక్క‌డ రాజీనామా చేస్తారంటూ ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. దీన్ని రాహుల్‌గాంధీ ఖండించారు. తాను గెలిచాక వ‌య‌నాడ్‌కే ప‌రిమిత‌మ‌వుతానంటూ ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న అమేథీని వ‌ద‌లుకుంటార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. అదీగాక ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాయ‌బ‌రేలీ నుంచి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

 అమేథీతో సుధీర్గ అనుబంధం..! విడిపోక తప్పట్లేదంటున్న శ్రేణులు..!!

అమేథీతో సుధీర్గ అనుబంధం..! విడిపోక తప్పట్లేదంటున్న శ్రేణులు..!!

అలాగే తూర్పు యూపీ ఇన్ఛార్జీగా ప్రియాంకా గాంధీ ఉన్నారు. ఉత్త‌ర‌భార‌తానికి వీరిద్ద‌రి ప్రాతినిధ్యం కాంగ్రెస్ త‌ర‌ఫున ఉంటుంది. కాంగ్రెస్‌కు ద‌క్షిణ‌భార‌తానికి త‌న ప్రాతినిధ్యం ఉండాల‌న్న ఉద్దేశంతో రాహుల్‌గాంధీ వ‌య‌నాడ్‌లోనే ఎంపీగా కొన‌సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఉప ఎన్నిక వ‌స్తే ప్రియాంక పేరు..! అన్న బాటలో చెల్లి..!!

ఉప ఎన్నిక వ‌స్తే ప్రియాంక పేరు..! అన్న బాటలో చెల్లి..!!

అమేథీలో గెలిచాక రాజీనామా చేస్తే ఉప ఎన్నిక‌లు వ‌స్తాయి. ఆ స‌మ‌యంలో అక్క‌డి నుంచి ప్రియాంక‌గాంధీని పోటీ చేయించాల‌నే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం ప్రియాంక వార‌ణాసి నుంచి ప్ర‌ధాని మోడీపై పోటీ చేసే ప్ర‌య‌త్నాలల్లో ఉన్నారు. ఇక్క‌డ ఓడిపోయినా.. త‌ర్వాత అమేథీ ఉప ఎన్నిక‌లో ప్రియాంక పోటీ చేయించాల‌నేది రాహుల్‌గాందీ ప్లాన్‌గా ఉంది. ఒక‌వేళ ప్రియాంక పోటీ చేయ‌ని ప‌క్షంలో గాంధీల కుటుంబానికి అత్యంత స‌న్నిహితంగా మ‌రొక‌రి పేరు ప‌రిశీలించ‌వ‌చ్చనే చర్చ జరుగుతోంది.

English summary
Rahul Gandhi is making it clear that the BJP has an endless discrimination against South India and hence he is contesting from here Wayanad and saying that he is from the South.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X