వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కుమారస్వామికి రాహుల్ గాంధీ ఫోన్: కంట్రోల్, కాంగ్రెస్ నాయకులకు షాక్, బీజేపీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలను బుజ్జగించే పని మీరే దగ్గరుండి చూసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వాకిమి కాంగ్రెస్ పార్టీ జాతీయ అద్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలతో స్వయంగా మీరు మాట్లాడాలని సీఎంకు కుమారస్వామికి రాహుల్ గాంధీ ఫోన్ చేసి సూచించారని సమాచారం.

మంత్రి పదవి రాలేదని మాజీ మంత్రి ఎంబి. పాటిల్ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసిన విషయం తెలిందే. ఎంబి. పాటిల్ కు దాదాపు 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇస్తున్నారని సమాచారం. ఈ సందర్బంలో రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు గాలం వెయ్యడాకి ప్రయత్నిస్తున్నారని సమాచారం.

Rahul Gandhi had called CM Kumaraswamy and sugested him to control rebel MLAs of Congress.

రాహుల్ గాంధీ సూచన మేరకు సీఎం. కుమారస్వామి స్వయంగా ఎంబి. పాటిల్ ఇంటికి వెళ్లి చర్చించి వచ్చారని సమాచారం. ఎంబి. పాటిల్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత నచ్చచెప్పినా ఆయన వినకపోవడంతో రాహుల్ గాంధీ స్వయంగా సీఎం కుమారస్వామిని రంగంలోకి దింపారని సమాచారం.

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులను కాదని రాహుల్ గాంధీ కుమారస్వామిని రంగంలోకి దిచండతంతో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చర్చకుదారితీసింది. రెబల్ ఎమ్మెల్యేలకు నచ్చచెప్పడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విఫలం కావడం వలనే కుమారస్వామిని రంగంలో దింపవలసి వచ్చిందని సమాచారం.

English summary
Karnataka cabinet expansion: Congress president Rahul Gandhi had called chief minister HD Kumaraswamy and sugested him to control rebel MLAs of Congress. This development creates tension among state congress leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X