వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా నాన్నను చంపినోళ్లను క్షమించా -గొంతు నొక్కితే యువత సైలెంటైపోదు -సంక్షోభ పుదుచ్చేరిలో రాహుల్ గాంధీ

|
Google Oneindia TeluguNews

''మా నాన్న చనిపోయారని తెలిసినప్పుడు గుండె పగిలిపోయేంతగా బాధపడ్డాను. అది నా జీవితంలో అత్యంత సంక్లిష్టమైన సమయం. అయితే, అప్పుడుగానీ, ఇప్పుడుగానీ ఎవరిపైనా నాకు కోపం, ద్వేషం లేవు. మా నాన్నను చంపినవాళ్లను నేను క్షమించాను. నిజానికి మరణం మన నుంచి దేన్నీ తీసుకుపోలేదు. మా నాన్న ఇప్పటికీ నాలోనే, నా ద్వారానే మాట్లాడుతున్నాడు..'' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.

ప్రత్యేక రాయలసీమకు వైఎస్ షర్మిల -ఒకటికి కోటి బాణాలు -కేసీఆర్ బర్త్‌డేలో గంగుల సంచలనంప్రత్యేక రాయలసీమకు వైఎస్ షర్మిల -ఒకటికి కోటి బాణాలు -కేసీఆర్ బర్త్‌డేలో గంగుల సంచలనం

 సంక్షోభ పుదుచ్చేరిలో పర్యటన..

సంక్షోభ పుదుచ్చేరిలో పర్యటన..


ఇంకో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనగా.. కాంగ్రెస్ మంత్రులు ఒక్కొక్కరుగా బీజేపీలోకి జంప్ అయిపోతుండటంతో పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. నారాయణస్వామి కేబినెట్ మంత్రి నమశ్శివాయం, ఎమ్మెల్యే తీప్పైనాథన్ లు ఇటీవల బీజేపీలో చేరగా, ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు స్వచ్ఛంద రాజీనామా, మరో ఎమ్మెల్యే జాన్ కుమార్ రాజీనామాలతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని బీజేపీ ఆరోపిస్తోంది. కానీ సీఎం మాత్రం తమ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని, పూర్తి మెజారిటీ ఉందని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంలో కేంద్రానికి అనుగుణంగా వ్యవహరించని కారణంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై మోదీ సర్కారు వేటేసింది. ప్రస్తుతం సంక్షోభం నెలకొన్న పుదుచ్చేరిలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ బుధవారం పర్యటించారు.

యూత్ పవరే అది..

యూత్ పవరే అది..

ఒకరోజు పర్యటన కోసం పుదుచ్చేరి వచ్చిన రాహుల్ గాంధీ.. స్థానిక భారతిదాసన్ ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులతో సమావేశమయ్యారు. రాజీవ్ గాంధీ హంతకుల గురించి ఓ విద్యార్థిని అడిగి ప్రశ్నకు సమాధానమిస్తూ, 'వాళ్లను నేను క్షమించాను'అని రాహుల్ బదులిచ్చారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ కేంద్రం జైళ్లలోకి నెట్టేయడాన్ని, ఇటీవల యువ పర్యావరణ కార్యకర్త దిశ రవి అరెస్టు తదితర అంశాలను పరోక్షంగా ప్రస్తావించిన ఆయన.. ప్రభుత్వం తనకున్న బలంతో ఎంత గట్టిగా యువత గొంతు నొక్కాలని చూస్తే, యువతరం అంతే బదులిస్తుందని అన్నారు. ''మీరు దేశాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ, కనీసం మాట్లాడనీయకుండా చేస్తే అది దేశ విధిని నాశనం చేసినట్లేనని గుర్తుంచుకోండి. ఎవరూ నోరు తెరవకుండా ఉండేలా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను యువకులెవరూ అనుమతించొద్దు. రాజ్యాంగ నిబంధనల మేరకు పోరాడాల్సిందే'' అని రాహుల్ పేర్కొన్నారు. కాగా,

మత్యకారులు సముద్ర రైతులు..

మత్యకారులు సముద్ర రైతులు..

విద్యార్థులతో భేటీకి ముందు బంగాళాఖాతం తీరంలో మత్స్యకారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, రైతులకు వ్యతిరేకంగానే సాగు బిల్లులను కేంద్రం తెచ్చిందన్నారు. మత్స్యకారుల సమావేశంలో రైతుల గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగించ వచ్చని, అయితే మత్స్యకారులు కూడా సముద్ర రైతులేనని అన్నారు. ఈ దేశ భూమిపుత్రలకు (రైతులకు) కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఉన్నప్పడు సముద్ర రైతులు (మత్స్యకారులు)కు మంత్రిత్వ శాఖ ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. కేంద్రంలోని ప్రభుత్వం చిన్న, మధ్యతరహా వ్యాపారాలను దెబ్బతీసిందని, బడా కార్పొరేట్ల గుప్పిట్లోనే అన్ని వ్యాపారాలు ఉండాలన్న కారణంతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగిందని రాహుల్ ఆరోపించారు. ఇందుకు భిన్నమైన అభిప్రాయం కాంగ్రెస్‌దని చెప్పారు. చిన్న, మధ్యతరహా వ్యాపారాలను పటిష్టం చేయాలన్నదే పార్టీ అభిమతమని, వారివల్లే దేశానికి బలం చేకూరుతుందని అన్నారు. కాగా,

ఇటాలియన్‌లో కౌంటరిచ్చిన కేంద్రం..

ఇటాలియన్‌లో కౌంటరిచ్చిన కేంద్రం..

మంత్రిత్వ శాఖ ఉన్నప్పడు సముద్ర రైతులు (మత్స్యకారులు)కు మంత్రిత్వ శాఖ ఎందుకు ఉండకూడదంటూ కొత్త డిమాండ్ లేవనెత్తిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేంద్రం అనూహ్య రీతిలో బదులిచ్చింది. కేంద్ర మత్యశాఖను నిర్వహిస్తోన్న మంత్రి గిరిరాజ్ సింగ్ ఇటాలియన్ భాషలో ట్వీట్ చేశారు. సోనియా పుట్టిన దేశం ఇటలీలో కూడా మత్యకారుల సంక్షేమానికి శాఖ లేదని, వ్యవసాయ శాఖ పరిధిలోకే మత్యకారులు వస్తారని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు.

ys sharmila అసాధారణ స్పీడు -యుద్ధ నౌక గద్దర్, మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ -సలహాదారులూ ఖరారు!ys sharmila అసాధారణ స్పీడు -యుద్ధ నౌక గద్దర్, మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ -సలహాదారులూ ఖరారు!

English summary
amid political crisis in puducherry, Congress leader Rahul Gandhi on Wednesday visited the state. speaking to students, rahul said he had forgive killers of his father rajiv gandhi. rahul also interacted with fishermen families. Rahul Gandhi demands separate fishery ministry, Giriraj Singh's epic reply in Italian
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X