వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ ఓ బచ్చా, ఇవి కూడా నేర్పరా?: కేజ్రివాల్ ఫైర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ఢిల్లీలో రైల్వే స్థలాల ఆక్రమణల తొలగింపుపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు పార్లమెంటు వద్ద గొడవ చేస్తోంది.. ఢిల్లీలో అధికారంలో ఉంది వారే కదా' అని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘రాహుల్‌ ఇంకా చిన్నపిల్లాడు.. అతడికి కనీసం రైల్వే కేంద్ర ప్రభుత్వం కిందకు వస్తుందనే అంశం కూడా పార్టీ వారు నేర్పించినట్లు లేరు' అని ట్విట్టర్‌లో అరవింద్ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. పశ్చిమ ఢిల్లీలోని షకూర్‌ బస్తీలో రైల్వే స్థలాల్లో ఉన్న దాదాపు 1200 ఇళ్లను అధికారులు తొలగించారు.

ఈ క్రమంలో ఓ ఇంట్లో ఆరు నెలల పసిపాప రుకైయా మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై కేజ్రీవాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనను నిరసిస్తూ పార్లమెంటు ఎదుట ఆప్‌, టిటీఎంసీ ఎంపీలు ఆందోళన చేపట్టారు.

షకూర్ బస్తీలో రాహుల్ పర్యటన

కాగా, ఢిల్లీలోని షకూర్ బస్తీలోని గుడిసెల కూల్చివేతతో ఆశ్రయం కోల్పోయిన బాధితులను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. మురికివాడలో పర్యటించిన ఆయన ప్రభుత్వ తీరును ఖండించారు. స్థానికులతో మాట్లాడి సంఘటన వివరాలు తెలుసుకున్నారు.

Rahul Gandhi is still a child, says Arvind Kejriwal

షాకుర్ బ‌స్తీ ఘ‌ట‌న‌పై లోక్‌స‌భ‌లో రైల్వే మంత్రి ప్ర‌క‌ట‌న‌

ఢిల్లీలోని షాకుర్ బ‌స్తీ ఘటనపై సోమవారం ప్ర‌తిప‌క్షాలు లోక్‌స‌భ‌లో ప్ర‌భుత్వాన్ని నిల‌దీశాయి. మురికి వాడ‌ల్లో నివ‌సిందే పేద ప్ర‌జ‌ల‌ప‌ట్ల ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించే తీరు ఇదేనా? అని ప్ర‌శ్నించాయి.

దీంతో సంబంధిత రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్ర‌భు ఇందుకు సంబంధించి స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేశారు. అధికారులు స‌రియైన విధంగానే నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే వ్య‌వ‌హ‌రించార‌ని స్ప‌ష్టం చేశారు. ఇళ్ల తొలగింపునకు ముందే చిన్నారి మృతి చెందిందని, రాజకీయ పార్టీలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal said Congress vice president Rahul Gandhi is ‘still a child’ after the latter’s purported remarks on the slum demolition drive in the national capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X