వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ దాడులు, మోడీ దెబ్బతో రాహుల్ గాంధీ బహిరంగ సభ ఫినిష్, అక్కడికి రండి!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ నివాసం, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడుల చేసిన విషయంలో ఏఐసీసీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. రాహుల్ గాంధీ చెప్పిన సమాధానం విన్న మీడియా బిత్తరపోయింది.

బీజేపీ షాక్, మంత్రి డీకే ఇంటిలో రెండో రోజు ఐటీ సోదాలు, లాకర్ల పాస్ వర్డ్ తెలీదు. అంతేనా?బీజేపీ షాక్, మంత్రి డీకే ఇంటిలో రెండో రోజు ఐటీ సోదాలు, లాకర్ల పాస్ వర్డ్ తెలీదు. అంతేనా?

డీకే. శివకుమార్ కు సంబంధించిన ఐటీ దాడుల విషయంలో తాను ఏమీ మాట్లాడనని సొంత పార్టీకి చెందిన మంత్రి విషయంలో రాహుల్ గాంధీ షాక్ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో తాను గుజరాత్ వెలుతున్నా, మీరు అక్కడికి రండి, గుజరాత్ విషయంలో ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానం ఇస్తానని రాహుల్ గాంధీ తెలివిగా తప్పించుకున్నారు.

Rahul Gandhi maintains silence about Karnataka IT raids

కాంగ్రెస్ పార్టీ ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్టు 4వ తేదీ గురువారం కర్ణాటకలోని రాయచూరులో జరిగే భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరుకావలసి ఉంది. అయితే కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి డీకే. శివకుమార్ మీద ఐటీ శాఖ దాడులు చెయ్యడంతో రాహుల్ గాంధీ వెనక్కి తగ్గారు.

ఐటీ దాడుల ఎఫెక్ట్: మంత్రి డీకే శివకుమార్ ఆస్తుల విలువ ఎన్ని రూ. వందల కోట్లు అంటే?ఐటీ దాడుల ఎఫెక్ట్: మంత్రి డీకే శివకుమార్ ఆస్తుల విలువ ఎన్ని రూ. వందల కోట్లు అంటే?

ఉపరాష్ట్రపతి ఎన్నికలు, రాజస్థాన్ రాజ్యసభ ఎన్నికల్లో తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న రాహుల్ గాంధీ ఇప్పుడు అయోమయంలో పడిపోయారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం ఎలాంటి బహిరంగ సభల్లో పాల్గోనే ఉద్దేశం లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.

English summary
AICC vice president Rahul Gandhi has cancelled his visit to Raichur. Rahul Gandhi was scheduled attend the Youth congress convention on August 04 organised by Basavanagowda Badarli, State Youth Congress president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X