రాహుల్‌పై నిందలు వద్దు: కాంగ్రెస్ ఓటమిపై ఆంటోనీ

ఓటమికి రాహుల్ గాంధీని నిందించకూడదని, పార్టీని బలహీనపరచడానికి కొంత మంది రాహుల్ గాంధీని నిందించే పని పెట్టుకున్నారని ఆంటోనీ కమిటీ అభిప్రాయపడింది. కమిటీ నివేదికను గురువారంనాడు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అందించారు. పా్రటీ ఓటమికి ఇతర కారణాలు ఉన్నాయని నివేదికలో అభిప్రాయపడ్డారు.
సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో పార్టీ తిరిగి పుంజుకుంటుందని ఆంటోనీ అభిప్రాయపడ్డారు. కమిటీ సభ్యులు ఆంటోనీ, ముకుల్ వాస్నిక్, ఆర్‌సి కుంటియా, అవినాష్ పాండే గురువారంనాడు సోనియా గాంధీని కలిసి నివేదికను అందించారు.
అత్యంత భారీగా ఉన్న నివేదిక సంక్షిప్త పాఠాన్ని కూడా సోనియాకు అందించారు. రాష్ట్రాలను విడివిడిగా తీసుకుని ఆయా రాష్ట్రాల నాయకులతో మాట్లాడి నివేదికను రూపొందించారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నివేదిక ఆధారంగా సమస్యలను పరిష్కరించుకోవాలనే ఆలోచనలో కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications