వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువరాజు చక్రం తిప్పేనా? సిద్దూతో, అఖిలేష్ తో చర్చలకు రాహూల్ సమాయత్తం

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూతో చర్చించనున్నారు. సిద్దూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకొంది. ఈ ఎన్నికల్లో వివిద పార్టీల ఎత్తులు, వ్యూహలతో సన్నద్దం అవుతోంది.ఈ మేరకు ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఆ పార్టీ ఖరారు చేయనుంది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లో పార్టీ వ్యూహాలను పార్టీ ఉపాధ్య క్షుడు రాహూల్ గాంధీ అమలు చేయనున్నారు. విదేశాల్లో గడిపి వచ్చిన రాహూల్ గాంధీ ఇక ఎన్నికలపైనే కేంద్రీకరించనున్నారు.

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు ప్రధానమైనవి. అయితే ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి.

పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీచేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.అయితే ఈ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ బిజెపికి రాజీనామా చేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.

మరో వైపు మిగిలిన మూడు రాష్ట్రాల్లో కూడ కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాలకు అనుకూలమైన వ్యూహాన్ని సిద్దం చేస్తోంది. ఈ వ్యూహాలకు అనుగుణంగా పార్టీని నడిపించేందుకు రాహూల్ సన్నద్దమయ్యాడు.

సిద్దూతో చర్చించనున్న రాహూల్

సిద్దూతో చర్చించనున్న రాహూల్

పంజాబ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న అకాలీదశ్ బిజెపి కూటమికి ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దరిమిలా బిజెపికి దూరమైన క్రికెటర్ సిద్దూను తమ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ ఆహ్వనించనుంది. ఈ మేరకు ప్రాథమిక చర్చలు ప్రారంభించారు. అయితే కొన్ని విషయాల్లో ఇంకా స్పష్టత రావాల్సిన పరిస్థితులున్నాయని పార్టీ నాయకులు అభిప్రాయంతో ఉన్నారు. దరిమిలా సిద్దూతో రాహూల్ గాంధే చర్చించే అవకాశాలున్నాయి.ఈ మేరకు రాహూల్ సిద్దూతో చర్చించిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయి.ఈ మేరకు సిద్దూకు రాహూల్ ను కలిసే అపాయింట్ మెంట్ కూడ ఖరారైందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎస్ పి తో పొత్తుకు కాంగ్రెస్ సై

ఎస్ పి తో పొత్తుకు కాంగ్రెస్ సై

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ రెండు పార్టీల పొత్తు వల్ల తమకు కూడ ప్రయోజనం కలుగుతోందని సమాజ్ వాదీ పార్టీ కూడ అభిప్రాయంతో ఉంది. ఇదే విషయాన్ని బహిరంగంగానే అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. సమాజ్ వాదీతో పొత్తు పెట్టుకొంటే ముఖ్యమంత్రి బరి నుండి తప్పుకోవడానికి తాను కూడ సిద్దంగా ఉన్నానని మాజీ ముఖ్యమంత్రి , యూపి బరిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తోన్న ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్ కూడ ప్రకటించారు. అయితే ఇప్పటికే ప్రియాంక గాంధీ కూడ అఖిలేష్ తో పొత్తు విషయమై చర్చించారు. ఈ విషయాలను ప్రియాంక గాంధీ రాహూల్ కు వివరించారు. అఖిలేష్ తో రాహూల్ సమావేశం కానున్నారు.

అసెంబ్లీ ఎన్నికలపై చర్చలు

అసెంబ్లీ ఎన్నికలపై చర్చలు

నెలరోజుల విశ్రాంతి తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన రాజీవ్ గాంధీ ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇప్పటివరకు ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించారు. ఈ విషయమై పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో రాహుల్ చర్చించారు. సోనియాతో పాటు ప్రియాంక గాంధీ రాహుల్ తో చర్చల సందర్భంగా ఉన్నారు.

పెండింగ్ లోని సమస్యలను పరిష్కరించనున్న రాహూల్

పెండింగ్ లోని సమస్యలను పరిష్కరించనున్న రాహూల్

ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలతో పొత్తులు, వ్యూహలను దృష్టిలో ఉంచుకొని పార్టీ పెండింగ్ లో ఉన్న అంశాలను త్వరలోనే పరిష్కరించనున్నారు రాహూల్ .ఇతర పార్టీలతో పొత్తులు, ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి అభ్యర్థులకు ఆహ్వనించడం వంటి కొన్ని నిర్ణయాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ పెండింగ్ లో ఉన్న అంశాలన్నింటికి ఆయన పరిష్కారం ఇవ్వనున్నారు. అభ్యర్థుల ఎంపికపై కూడ ఆయన తనదైన ముద్రవేసే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

English summary
rahul gandhi prepare to plan face five states assembly elections , he will be discuss with former crickter sidhu, about joing in congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X