పెట్రో మంటపై కాంగ్రెస్ ఆందోళనలు- ఢిల్లీ విజయ్ చౌక్ లో ఎంపీల ధర్నా- కేంద్రంపై రాహుల్ ఫైర్

దేశవ్యాప్తంగా అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రో ధరలపై కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరసనలకు చేపట్టింది. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఈ నిరసనల్లో పాల్గొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరల్ని నియంత్రించకుండా చోద్యం చూస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

పది రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలకు విరసనగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలో నిరసనలు ప్రారంభించారు. ఢిల్లీలోని విజయ్ చౌక్ లో కాంగ్రెస్ నేతలతో కలిసి ధర్నా చేపట్టిన రాహుల్ గాంధీ .. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. గత 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 9 సార్లు పెరిగాయని, పెరుగుతున్న ధరలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామని, ఈ అంశంపై కాంగ్రెస్ ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తోందని తెలిపారు.

rahul gandhi protest with congress mps against fuel prices at delhi vijay chowk

మరోవైపు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పెట్రో ధరలు అడ్డూ అదుపూలేకుండా పెరుగుతున్నా కేంద్రం నిర్లక్ష్యంగా ఉండటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విన్నూత్న పద్ధతుల్లో కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. తెలంగాణతో పాటు పలురాష్ట్రాల్లో నేతలు రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. కేంద్రం పెట్రో ధరలు తగ్గించే వరకూ తమ ఆందోళన ఆగదని హెచ్చరిస్తున్నారు.అయినా కేంద్రం నుంచి కనీస స్పందన కరవవుతోంది. ఇప్పటికే రష్యా నుంచి డిస్కౌంట్ పై చమురు దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్తున్నా.. వాటి ప్రయోజనం మాత్రం వినియోగదారులకు ఆందడం లేదు.మరోవైపు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడం చమురు వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+