వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదునెలల గర్భిణీని రేప్ చేసినోళ్లని వదిలేస్తారా ? మహిళలకిచ్చే మెసేజ్ ఏంటి ? మోడీపై రాహుల్ ఫైర్

|
Google Oneindia TeluguNews

2002లో గుజరాత్ అల్లర్ల సందర్భంగా ఐదు నెలల గర్భిణీ అయిన బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి, ఆమెతో పాటు మూడేళ్ల కుమార్తెను పొట్టనబెట్టుకున్న వారిని తాజాగా బీజేపీ సర్కార్ విడుదల చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇవాళ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఫైర్ అయ్యారు.

గుజరాత్ లోని బీజేపీ సర్కార్ బిల్కిస్ బానో హంతకుల్ని వదిలేయడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. దీనిపై ప్రధాని మోడీ.. మహిళలకు ఏం చెప్తారని రాహుల్ ప్రశ్నించారు. ఈ మేరకు ఇవాళ ఓ ట్వీట్ చేశారు. 'ఆజాదీ కే అమృత్ మహోత్సవ్' సందర్భంగా 5 నెలల గర్భిణిపై అత్యాచారం చేసి, ఆమె 3 ఏళ్ల బాలికను చంపిన వారిని విడుదల చేశారని, మహిళా శక్తి గురించి మాట్లాడుతున్న ప్రధాని మోడీ.. దేశ మహిళలకు ఇచ్చే సందేశం ఏమిటని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రధానమంత్రి గారు, దేశం మొత్తం మీ మాటలకు, చేతలకు తేడా చూస్తోందని రాహుల్ ఆక్షేపించారు.

rahul gandhi questions pm modis stand on release of bilkis bano rapists by bjp government

మరోవైపు రాహుల్ గాంధీ ట్వీట్ కు సోషల్ మీడియాలో మద్దతు లభిస్తోంది. పలువురు సామాజిక వేత్తలు రాహుల్ ట్వీట్ ను రీట్వీట్ చేయడంతో పాటు సమర్ధిస్తూ ట్వీట్లు పెడుతున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ నేత, సామాజిక ఉద్యమకారిణి హర్మీత్ కౌర్ కూడా స్పందించారు. గుజరాత్ ప్రభుత్వం వదిలేసిన బిల్కిస్ బానో రేపిస్టులకు బీజేపీ టికెట్లు ఇచ్చి రేపు ఎన్నికల్లో నిలబెడుతుందేమో అని ప్రశ్నించారు. వీహెచ్ పీ నేతలు వారికి స్వాగతం పలకడం చూస్తుంటే ఇదే జరుగుతుందేమో అని ఓ వెబ్ సైట్ వార్తను పోస్టు చేస్తూ హర్మీత్ కౌర్ వ్యాఖ్యానించారు.

English summary
congress mp rahul gandhi on today questions pm modi on gujarat's bilkis bano rapists release.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X