Rahul Gandhi : రాహుల్ గాంధీకి కావాల్సింది ఇలాంటి అమ్మాయేనట..!
కాంగ్రెస్ యువ ఎంపీ, గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ లో ఒకరు. ఆయన పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్ చల్ చేస్తూనే ఉంటాయి. అయితే ఇన్నాళ్లూ వాటిపై స్పందించని రాహుల్ గాంధీ.. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో మాత్రం అక్కడక్కడా తనను ఆవిష్కరించుకునే ప్రయత్నంలో రియాక్ట్ అవుతున్నారు.
ఈ మధ్య రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్ర జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ.. ఓ ఇంటర్వూ ఇచ్చారు.
కర్ట్ లీ టేల్స్ కామియా జానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ పలు విషయాల్ని తన అభిమానులతో పంచుకున్నారు. అందులో ఆయన పెళ్లికి సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు ఉన్నాయి. ముఖ్యంగా తనకు ఎలాంటి అమ్మాయి కావాలన్న దానిపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ తో పాటు ట్విట్టర్ లోనూ ఈ ఇంటర్వ్యూను పోస్ట్ చేసింది.
Check out this fun interaction between @RahulGandhi and Kamiya Jani of Curlytales where they discuss food, travel, marriage plans, first paycheck & much more...
— Congress (@INCIndia) January 22, 2023
Click on the link below to watch the full video.https://t.co/K5JKixgQXb#BharatJodoYatra pic.twitter.com/i5lzQvFHXs













Click it and Unblock the Notifications