"డెహ్రడూన్ లో దాక్కున్న ఆమెనూ వదలం"- రాహుల్ చెప్పిన మహిళ ఎవరంటే ?
ఎస్ఐఆర్ వివాదాల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం పట్టుబడుతున్న విపక్ష ఇండియా కూటమికి విపక్ష నేత రాహుల్ గాంధీ హై-టీ (Rahul Gandhi ) ఏర్పాటు చేశారు. దీనికి విపక్థష నాయకులంతా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ.. ఎస్ఐఆర్ వివాదం వెనుక ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. ఇందులో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ తో పాటు డెహ్రాడూన్ లో దాక్కున్న మహిళను కూడా వదిలిపెట్టబోమన్నారు. అందరినీ చట్టం ముందు నిలబెడతామన్నారు.
రాహుల్ చేసిన వ్యాఖ్యలో మోడీ, అమిత్ షా, జ్ఞానేష్ గురించి అందరికీ తెలుసు. వీరు కాకుండా ఆయన ప్రస్తావించిన ఆ డెహ్రాడూన్ మహిళ ఎవరనే చర్చ మొదలైంది. దీంతో ఎక్స్ లో ఎవరికి వారు తమకు తోచిన సమాధానాలతో ట్వీట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఎవరి గురించి మాట్లాడారో చూస్తే ఈ మధ్య ఎన్నికల సంఘంలో వివాదాలకు కేంద్ర బిందువైన ఓ మహిళ పేరు కనిపించింది. ఆమె పేరు సీమా ఖన్నా. ప్రస్తుతం ఈసీలో ఐటీ విభాగం డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. బహుశా ఆమెను ఉద్దేశించి రాహుల్ ఈ వ్యాఖ్య చేసి ఉంటారని తెలుస్తోంది.

Seema Khanna DG IT @ecisveep is hiding in Dehradun & singing like a canary about Gyanesh Chor & Manoj Agarwal Ex- CEO WB’s Vote Chori. Everything is known now. Suggest @KolkataPolice STFU & don’t send illegal take down notices on his behalf. Manoj Vote Chor Hai. Simple.
— Mahua Moitra (@MahuaMoitra) October 13, 2026
అయితే టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మాత్రం ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ట్వీట్ చేశారు. ఐటీ డీజీ సీమా ఖన్నా డెహ్రాడూన్లో దాక్కుని, దొంగ జ్ఞానేష్, పశ్చిమ బెంగాల్ మాజీ సీఈఓ మనోజ్ అగర్వాల్ ఓట్ల చోరీ గురించి అందరికీ తెలిసేలా పాడుతున్నారని మహువా ట్వీట్ చేశారు. ఇప్పుడు అంతా తెలిసిపోయిందన్నారు. అలాగ్ ఈ ట్వీట్ లో సూచన అంటూ కోల్ కతా పోలీసులు నోరు మూసుకోండి, మనోజ్ అగర్వాల్ తరపున చట్టవిరుద్ధమైన టేక్ డౌన్ నోటీసులు పంపవద్దంటూ టీఎంసీ ఎంపీ కోరారు. మనోజ్ ఓటు దొంగ... అంతే అని తేల్చిచెప్పారు. మరోవైపు ఈసీలో ఐటీ విభాగం డీజీగా ఉన్న సీమా ఖన్నాకు ఓటర్ల జాబితాతో పాటు ECINet సాఫ్ట్వేర్ వ్యవస్థలపై నియంత్రణ ఉందని తెలింది. దీనివల్ల స్థానిక ఎన్నికల అధికారుల అధికారాలు పరిమితమయ్యాయనే ఆరోపణలే వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నాయి. దీంతో రాహుల్ గాంధీ ఆమెనూ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.













Click it and Unblock the Notifications
