రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్, అసభ్యంగా !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురైయ్యింది. బుధవారం రాత్రి రాహుల్ గాంధీ ట్విట్టర్ ను లక్షంగా చేసుకుని హ్యాకర్లు ఆయన కుటుంబ సభ్యుల గురించి అభ్యంతరకరమై పోస్టులు చేశారు.

రాహుల్ గాంధీ, ఆయన కుటుంబ సభ్యులను అనరాని మాటలు అంటూ హంగామా చేసి నానా చెత్త విషయాలు పోస్టు చేశారు. వెంటనే విషయం గుర్తించిన రాహుల్ గాంధీ ఆన్ లైన్ మేనేజింగ్ టీమ్ ఆ ట్విట్లను తొలగించారు.

అయితే అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. రాహుల్ గాంధీ ఖాతాలోని ట్విట్లు ప్రింట్ స్క్రీన్ ల రూపంలో నెటిజన్లకు చేరిపోయాయి. రాహుల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడంతో నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తూనే మరో సారి జోకులు పేల్చారు.

 Rahul Gandhi’s Twitter account hacked, Abusived tweets posted !

ట్విట్టర్ అకౌంట్ పాస్ వర్డ్ శక్తివంతంగా ఉండాలని రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ పేరును పాస్ వర్డ్ గా పెట్టుకుని ఉంటారని ఓ వ్యక్తి ట్విట్ చేశారు. మరో వ్యక్తి మాత్రం ఇప్పటికి బాల్యపుఛాయలు వీడని రాహుల్ గాంధీ తన పాస్ వర్డ్ ను ఛోటాభీమ్ అని పెట్టుకుని ఉంటాడని అందుకు హ్యాక్ అయ్యిందని పోస్టు చేశారు.

మరొకరు అయితే సరేసరే. ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన వెంటనే రాహుల్ గాంధీ అమ్మ సోనియాకు విషయం చెప్పారని, అమ్మా నా అకౌంట్ హ్యాక్ అయ్యింది అని రాహుల్ అంటే పోతే పోనిలే ట్విట్టర్ అకౌంట్ కదా నేను ఇంకా స్విస్ అకౌంట్ అనుకున్నాను అని సోనియా చెప్పారని జోకులు వేస్తున్నారు. రాహుల్ గాంధీ ట్విట్టర్ హ్యాక్ చెయ్యడం వెనుక రాజకీయ హస్తం ఉండవచ్చని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The official Twitter account of Congress vice president Rahul Gandhi was hacked this evening and multiple abusive tweets were posted on it.
Please Wait while comments are loading...