Good News: మహిళల ఖాతాల్లో ఏటా రూ.లక్ష రూపాయలు..!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం మహిళలకు రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బుధవారం మహారాష్ట్రలోని ధులే జిల్లాకు చేరుకుంది. రాహుల్ అక్కడ మహిళలతను కలిసారు. వారితో మాట్లాడారు. మహిళా న్యాయ్ పేరిట 5 గ్యారెంటీలను వెల్లడించారు. మహాలక్ష్మి పథఖం ద్వారా పేద కుటుంబానికి చెందిన మహిళ బ్యాంకు అకౌంట్ లో ఏటా రూ.లక్ష జమ చేస్తామన్నారు.
ఆధి ఆబది పూరా హక్ పేరిట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్త్రీలకు 50శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రటించారు. మహిళ శక్తి సన్మానం పేరుతో వర్కర్లు, అంగన్ వాడీలు, మధ్యాహ్న భోజన పథకాల్లో పని చేస్తున్న మహిళలు నెలవారీ జీతం పెంచుతామని చెప్పారు. అధికార మైత్రి పేరిట గ్రామీణ ప్రాంతాల్లోని 2.5 లక్షల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రతి జిల్లాలో మహిళల కోసం సావిత్రీబాయి ఫూలే హాస్టళ్లను ఏర్పాటుచేస్తమని హామీ ఇచ్చారు.

కేంద్రంలో ఉన్న బీజేపీ దేశంలోని పారిశ్రామికవేత్తలకు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిందని రాహుల్ గుర్తు చేశారు. కానీ రైతులు, యువత రుణాలను మాత్రం కేంద్రం మాఫీ చేయలేదన్నారు. ఇలాంటి అన్యాయాల వల్లే దేశంలో హింస, విద్వేషాలు వ్యాపిస్తున్నాయన్నారు. రైతులు, యువత, మహిళల సలహాతోనే తాను మణిపూర్ నుంచి ముంబైకి భారత్ జోడో న్యాయ్ యాత్రను చేపట్టినట్లు చెప్పారు. అన్ని కులాలు, వర్గాలను కలుపుకుని పోవాలని, జనాభాకు అనుగుణంగా వనరులను పంచాలనేదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు.
చట్టసభల్లో రిజర్వేషన్ల పేరిట మహిళలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలుగా రాహుల్ పేర్కొన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రకరకాల జిమ్మిక్కులు చేస్తుందని చెప్పారు. జనాభాలో యాభై శాతం మంది వద్ద దేశ సంపదలో 3 శాతం ఉంటే.. కేవలం 22 మంది వద్ద 50 శాతానికి పైగా సంపద ఉందన్నారు.












Click it and Unblock the Notifications