కాంగ్రెస్‌లో ప్రక్షాళన.. కౌరువులను పంపించేద్దాం !.. జాబితా రెడీ చేయండి !! : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళనకు ఆపార్టీ నేత రాహుల్ గాంధీ నడుంబిగించారు. పదవులు అనుభవిస్తూ పనిచేయని నేతలను సాగనంపేందుకు రెడీ అయ్యారు. ఇంత కాలం భరించాం .. ఇక కదరదని తెల్చిచెప్పారు. ప్రజల్లోకి మరింత దూకుడుగా వెళ్లాలని నిర్ణయించారు. దేశంలో పార్టీ పుంజుకోవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని పార్టీ నేతలను హెచ్చరించారు.

పనిచేయని నేతలు వెళ్లిపోవచ్చు..
కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి వారికే పదవులు ఉంటాయి తప్ప.. పనిచేయని వారికి కాదన్నారు రాహుల్ గాంధీ. గుజరాత్‌లోని ద్వారకలో మూడు రోజుల పాటు జరిగే పార్టీ చింతన్ శిబిర్‌లో నేతలు, ఆఫీస్ బేరర్లతో సమావేశమయ్యారు. ఈసంద్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏసీ కార్యాలయాల్లో కూర్చుని ఏ పనీ చేయకుండా.. కాకమ్మ కబురు చెప్పే నేతలు వెళ్లిపోవచ్చంటూ హెచ్చరించారు. ఇలాంటి వారితో పార్టీకి తీవ్ర నష్టం అని పేర్కొన్నారు. వారు చేయకపోగా పనిచేసే ఇతరులను ఇబ్బంది పెడుతుంటారని మండిపడ్డారు.

పార్టీలో కౌరవులను గుర్తించండి..
కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత చూపని ఇలాంటి వారు చివరికి బీజేపీ వంచన చేరుతారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇటువంటి కౌరవులను వదిలించుకోవడమే పార్టీకి మంచిదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌరవుల జాబితాను సిద్ధం చేయాలని ఆ పార్టీ శ్రేణులను రాహుల్ కోరారు. బీజేపీ పాలనలో గుజరాత్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డిశంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు
ఈ ఏడాది డిశంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు , కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలపై మోదీ ప్రభుత్వం .. సీబీఐ, ఈడీలను , పోలీసు వ్యవస్థలను ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఎంత నీచానికైనా దిగుతుందని దుయ్యబట్టారు. గుజరాత్‌లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని పార్టీ శ్రేణుల్లో రాహుల్ గాంధీ ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు .












Click it and Unblock the Notifications