బీజేపీ, ఆరెస్సెస్ కు రాహుల్ గాంధీ థ్యాంక్స్- వాళ్లే నాకు గురువులు...!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై బీజేపీ, ఆరెస్సెస్ విమర్శలు గుప్పిస్తున్నాయి. కోవిడ్ పేరుతో ఓసారి, రోడ్లపై హంగామా చేస్తున్నారని మరోసారి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. అయితే వీటిపై మౌనంగానే ఉంటున్న రాహుల్ గాంధీ.. ఇవాళ మాత్రం వారికి థ్యాంక్స్ చెప్పారు.
భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ.. తాను భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు సీఆర్పీఎఫ్ చేసిన విమర్శలపై స్పందించారు. బీజేపీ ప్రభుత్వం తనను ఎలా విమర్శించాలో తెలియక భద్రతా బలగాలతో ఆరోపణలు చేయిస్తోందన్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ పదేపదే భద్రతా ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని, కోవిడ్ భయాల కారణంగా ఈ యాత్ర ఆపేయాలని కేంద్రం లేఖలు పంపుతోంది. దీనిపై రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్లండని హోం మంత్రిత్వ శాఖ చెబుతోందని, కానీ తాను యాత్ర కోసం కాలినడకన నడవాల్సిందేనన్నారు. భద్రత కోసం ఏమి చేయాలో వారికి తెలుసన్నారు.

తన భారత్ జోడో యాత్రను అడ్డుకునేందుకు కేంద్రం చేస్తున్న విమర్శలపై స్పందించిన రాహుల్.. బీజేపీ, ఆరెస్సెస్ లకు థ్యాంక్స్ చెప్పారు. వారి విమర్శలకు తనకే పనికొస్తాయన్నారు. బీజేపీ నేతలు వివిధ రాష్ట్రాల్లో రోడ్ షోలు చేస్తున్నారని, వారికి మాత్రం నిబంధనలు అడ్డురావని, తనకు మాత్రమే వస్తాయా అని రాహుల్ ప్రశ్నించారు. అలాగే ఈ బీజేపీ నేతలే తనకు గురువులని రాహుల్ అన్నారు. కేంద్రంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉందని, విపక్షాలు ఇప్పటికైనా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications