మనుషులతో మాట్లాడేది లేదా ? .. శునకంతో షికార్లా ... ఫోటో వైరల్
న్యూఢిల్లీ : ఎన్నికల ఫలితల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందడంతో అధ్యక్ష పదవీకి రాహుల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు తర్వాత కాంగ్రెస్ నేతలకు అందుబాటులో లేరు. ఫోన్ స్విచ్చాప్ చేయడంతో ముఖ్య నేతలు ఇంటికొచ్చినా కలువని పరిస్థితి. ఇంతవరకు ఓకే .. కానీ రాహుల్ తన పెంపుడు కుక్కతో బయటకెళ్లిన ఓ ఫోటో ఇంటర్నెట్‌లో వైరలైంది.

పిడితో అలా షికారు ..
సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తన పెంపుడు కుక్క పిడితో కలిసి రాహుల్ బయటకెళ్లారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ఫోటో తీసి ట్వీట్ చేశారు. దానికి ట్యాగ్ లైన్ 'ప్రేమను ఆస్వాదించకపోవడం ఆపలేను‘ అని పెట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం కూడా న్యూఢిల్లీలోనే ఉన్నారని అనిల్ శర్మ అనే నెటిజన్ క్యాప్షన్ పెట్టారు. దీంతో ఆ ఫోటో నెట్టింట్లో తెగ వైరలవుతుంది.

ఢిల్లీ గల్లీలో ..
మంగళవారం రాహుల్ తన పెంపుడు కుక్కతో బయల్దేరారు. తుగ్లక్ లేన్ వద్ద గల తన ఇంటి నుంచి కారులో పిడితో కలిసి వెళ్లున్నారు. కారు వెనుకసీటులో రాజసంగా పిడి కూర్చొంది. ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ ఎవరినీ కలువకపోవడం .. కుక్కతో కలిసి షికారు చేయడంపై సెటైర్లు వేస్తున్నారు. దీనినిబట్టి ఓ వ్యక్తికి తనతోటి మనుషుల కన్నా సాధు జంతువైనా కుక్క మంచి స్నేహితుడిగా మారినట్టు ఆ ఫోటో సజీవ సాక్ష్యమని రుజువైంది. ఫోటోను షేర్ చేసిన నెటిజన్ .. కాంగ్రెస్ అధ్యక్షుడు తన పెంపుడు జంతువుపై చూపిస్తోన్న ప్రేమను చూడండి అని కామెంట్ పెట్టాడు.

వైరల్
అనిల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. నెటిజన్లు ట్రోల్ పీక్‌కి చేరింది. ఇప్పటికే 170 రీ ట్వీట్లు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు .. 770 లైకులతో ట్వీట్ దూసుకెళ్తోంది. తన పెంపుడు కుక్క పిడికి సంబంధించిన వివరాలను 2017లోనే రాహుల్ వెల్లడించారు. ఓ ఫన్నీ వీడియో తీసి తన ట్వీట్టర్ లో పెట్టారు. 'మీకు ఎవరికైనా సాయం కావాలా .. నేను వస్తోన్నా .. నా పేరు పీడీ .. నేను రాహుల్ కన్నా శాంతిగా ఉంటా‘ అని రాహుల్ ట్వీట్ లో రాశాడు. ఆ వీడియోలో రాహుల్ పిడి .. ఫుడ్ పెడుతూ కనిపించాడు.












Click it and Unblock the Notifications