వ్యాక్సిన్ల కొరత పై రాహుల్ షాకింగ్ ట్వీట్; మీ ప్రాబ్లమ్ ఏంటి? అంటూ కేంద్ర మంత్రుల ఘాటు రిప్లై
దేశానికి కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని ఒకపక్క నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో దేశంలో కరోనా టీకాల కొరతపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా విరుచుకుపడిన రాహుల్ గాంధీ జులై నెల వచ్చింది కానీ వ్యాక్సిన్లు మాత్రం రాలేదని చేసిన ట్వీట్ తో రాహుల్ గాంధీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రులు మండిపడుతున్నారు.

రాహుల్ పై ధ్వజం .. చదవలేరా ? చదివింది అర్ధం చేసుకోలేరా ? హర్షవర్ధన్ ఫైర్
దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉందని జులై నెల వచ్చినా వ్యాక్సిన్లు రాలేదని కేంద్రాన్ని ప్రశ్నిస్తూ రాహుల్ చేసిన ట్వీట్ తో పాటు వ్యాక్సిన్లు ఎక్కడ ఉన్నాయి అంటూ ప్రశ్నలను సంధించారు రాహుల్ గాంధీ. దీనికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు రాహుల్ గాంధీ సమస్య ఏంటి అంటూ ప్రశ్నించారు. జులై నెలలో వ్యాక్సిన్ లభ్యత గురించి తాను ఒక ప్రకటన విడుదల చేశానని, అయినా రాహుల్ గాంధీ సమస్య ఏంటి అని ప్రశ్నించారు. ఆయన చదవలేరా లేక చదివింది అర్థం చేసుకోలేరా అంటూ మండిపడిన హర్షవర్ధన్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పుపై ఆలోచించాల్సిందే: హర్ష వర్ధన్
అహంకారం, నిర్లక్ష్యం వంటి వైరస్ లకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు అని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పుపై ఆలోచించాల్సిందే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రాహుల్ గాంధీ తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని హర్షవర్ధన్ ఏది వాస్తవం అనేది అవాస్తవం అనేదాన్ని ప్రజలు నిర్ణయిస్తారని వెల్లడించారు. 75 శాతం వ్యాక్సిన్ లు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని జూన్ నెలలో 11.50 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపారు.జూలై నెలలో 12 కోట్ల డోసులను సరఫరా చేయబోతున్నామని వెల్లడించిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ పై రివర్స్ ఎటాక్ చేశారు.

రాహుల్ గాంధీ ట్వీట్ పై మండిపడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాహుల్ గాంధీ విమర్శలపై ఎదురు దాడికి దిగారు. కరోనా పై సాగిస్తున్న పోరాటంలో తీవ్రమైన విషయాలను పక్కన పెట్టి రాజకీయాలు చేయడం మంచిది కాదనే విషయాన్ని రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికే జులైలో 12 కోట్ల వ్యాక్సిన్ రోజులు అందుబాటులో ఉండనున్నాయని, అవి మాత్రమే కాకుండా ప్రైవేటు ఆసుపత్రులకు మరికొన్ని సరఫరా కానున్నాయని, దీనికి సంబంధించిన వివరాలను 15 రోజుల ముందే రాష్ట్రాలకు తెలియజేశామని మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

కేంద్ర టీకాల విధానంపై తీవ్ర విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గత కొద్ది నెలలుగా కేంద్ర ప్రభుత్వ టీకాల విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. దేశంలో వ్యాక్సిన్ మోతాదుల కొరతను నివారించాలని ఆయన ప్రధాని నరేంద్రమోదీకి అనేక సార్లు విజ్ఞప్తి చేశారు. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం వ్యాక్సినేషన్ లో ఫెయిల్ అవుతుందని విమర్శించారు .దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తీవ్రమైన వ్యాక్సిన్ కొరత ఉన్నట్టు ఆయన అనేక మార్లు పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో తాజాగా ఆయన కేంద్రాన్ని విమర్శిస్తూ వ్యాక్సిన్లు ఎక్కడ అంటూ ట్వీట్ చేశారు.

దేశంలో చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత .. రాహుల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత
కోవిషీల్డ్ మోతాదుల కొరత కారణంగా ఒడిశా ప్రభుత్వం 16 జిల్లాల్లో టీకా డ్రైవ్‌ను నిలిపివేసింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ల కొరత కారణంగా గత 10 రోజుల్లో కేవలం 16.63 లక్షల మందికి మాత్రమే టీకాలు వేయగలమని, రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నిర్దేశించిన లక్ష్యం కంటే దాదాపు 45% తక్కువ అని అస్సాం గురువారం తెలిపింది. మహారాష్ట్రలో, వ్యాక్సిన్ స్టాక్స్ కొరత కారణంగా ముంబైలోని 281 పౌర-కేంద్రాలు మరియు 20 ప్రభుత్వ కేంద్రాలలో వ్యాక్సిన్ డ్రైవ్‌ను మహా సర్కార్ నిలిపివేసింది. జార్ఖండ్, ఛత్తీస్ గడ్ , రాజస్థాన్ తదితర రాష్ట్రాలు కూడా కోవిడ్ -19 వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్నాయని తెలుస్తుంది.ఈ క్రమంలోనే రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications