వ్యాక్సిన్లపై చర్చించింది చాలు, అందరకీ ఫ్రీగా వ్యాక్సిన్లు ఇవ్వండి : కేంద్రానికి రాహుల్ గాంధీ అల్టిమేటం

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటంలో భారతదేశాన్ని బాధిత దేశంగా మార్చవద్దని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ రోజు అధికార బిజెపిని కోరారు. దేశ పౌరులందరికీ టీకాలు ఉచితంగా అందించాలని, ఇది ఇకపై చర్చించాల్సిన అవసరం లేదని ఆయన అల్టిమేటం ఇచ్చారు . భారతదేశాన్ని బిజెపి విధానాలకు బాధిత దేశంగా మార్చవద్దని వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీ బిజెపి సర్కార్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

    Rahul Gandhi Tests Positive For Covid-19 || Oneindia Telugu

     భారత్ ను బీజేపీ విధానాలకు బాధిత దేశంగా మార్చొద్దు : రాహుల్ గాంధీ

    భారత్ ను బీజేపీ విధానాలకు బాధిత దేశంగా మార్చొద్దు : రాహుల్ గాంధీ


    ఈ రోజు సోషల్ మీడియాలో చేసిన పదునైన ట్వీట్‌లో, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ ఇలా అన్నారు. వ్యాక్సిన్లపై ఇప్పటివరకు చర్చించింది చాలు ... పౌరులంతా తప్పనిసరిగా ఉచితంగా టీకా పొందాలి . భారత్ ను బీజేపీ విధానాలకు బాధిత దేశంగా మార్చొద్దు అంటూ సూటిగా పదునైన ట్వీట్ చేశారు.

    కోవిడ్ వ్యాక్సిన్ ధరల వ్యత్యాసం పై గత మూడు రోజులుగా కొనసాగుతున్న రగడ నేపథ్యంలో ఈ ట్వీట్ చేశారు కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ.

     మోడీ మిత్రులకు మేలు చెయ్యటం కోసమే వ్యాక్సిన్ ల ధరల వ్యత్యాసం

    మోడీ మిత్రులకు మేలు చెయ్యటం కోసమే వ్యాక్సిన్ ల ధరల వ్యత్యాసం


    మే 1 నుండి అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో సీరం సంస్థ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను కేంద్రానికి 150 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాలకు నాలుగు వందల రూపాయలు, ప్రైవేట్ ఆస్పత్రులకు ఆరు వందల రూపాయలు గా మూడు వేర్వేరు ధరలు ప్రకటించడంపై దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ వ్యూహంపై చర్చ జరుగుతుంది. రాహుల్ గాంధీ ఇది కేవలం ప్రధాని నరేంద్ర మోడీ మిత్రులకు మేలు చేయడం కోసమే తీసుకున్న నిర్ణయమని, సామాన్య ప్రజానీకానికి ఎలాంటి లాభం లేదని తీవ్రంగా మండిపడ్డారు.

     మోడీపై వ్యాక్సిన్ ధరల నిర్ణయంతో నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

    మోడీపై వ్యాక్సిన్ ధరల నిర్ణయంతో నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

    సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ వ్యూహం పెద్ద నోట్ల రద్దుకు ఏ మాత్రం తక్కువ కాదంటూ మండిపడ్డారు . ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్నేహితులకు ఇది గొప్ప అవకాశం అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు తమ డబ్బును, ఆరోగ్యాన్ని, జీవితాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు . కేంద్రం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు .

    అందరికీ ఫ్రీ వ్యాక్సిన్లు ఇవ్వాలని కేంద్రానికి అల్టిమేటం

    అందరికీ ఫ్రీ వ్యాక్సిన్లు ఇవ్వాలని కేంద్రానికి అల్టిమేటం

    కొత్త ధరల విధానం పట్ల దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీలు కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఒకే దేశం ఒకే వ్యాక్సిన్ విధానమంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు తమ రాష్ట్రంలోని ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లతో పాటుగా, హర్యానా, కర్ణాటక, ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాలు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ చర్చించాలని, అందరికీ ఉచితంగా వ్యాక్సిన్స్ ఇవ్వాలని కేంద్ర సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+