రాహుల్ గాంధీ కారుపై రాళ్ల దాడి (వీడియో)

మాల్దా: భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారు వెనుక అద్దం ధ్వంసమైంది. కాగా రాహుల్‌​కు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది.

మాల్దా జిల్లాలోని హరిశ్చంద్రపుర్‌​లో రాహుల్ ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగిందని పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి మీడియాకు తెలిపారు. ఇలాంటి దాడులు ఆమోదయోగ్యం కాదని అన్నారు. రాహుల్‌​ను భయం లేని వ్యక్తిగా ఆయన అభివర్ణించారు​. ఈ చర్యకు తృణమూల్ కాంగ్రెసే కారణమని ఆరోపించారు.

Rahul Gandhis car pelted with stones during Congress yatra in West Bengal: Adhir Ranjan Chowdhury

'కారు వెనుక నుంచి వచ్చి ఎవరైనా రాళ్లు రువ్వి ఉండొచ్చు. భద్రతా బలగాలు పట్టించుకోవట్లేదు. అందుకే ఇలాంటి ఘటన జరిగింది. చిన్న ఘటనే అయినా రాహుల్ ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి? రాహుల్‌​కు సరైన భద్రత లేదు. ఇది ఎవరు చేయించారో మీకు అర్థమైందా? కాంగ్రెస్ ఎవరినీ అణగదొక్కదు. అడుగడుగునా రాహుల్ గాంధీని ఇబ్బందిపెడుతున్నారు' అని అధీర్ రంజన్ చౌధరి పరోక్షంగా టీఎంసీపై మండిపడ్డారు.

ఇది ఇలావుంటే, లోక్‌​సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌​తో పొత్తు ఉండదని ఇటీవలే బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఒకవైపు మమత ఇంత స్పష్టంగా ఒంటరిగా పోటీచేస్తామని చెబుతుంటే.. కాంగ్రెస్‌ మాత్రం బంగాల్‌లో సీట్ల సర్దుబాటు అంశం ఇంకా హోల్డ్‌లోనే ఉన్నట్లు తెలపడం గమనార్హం. సీట్ల సర్దుబాటుపై తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్‌ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నాయని ఆ పార్టీ నేత జైరాం రమేశ్‌ తెలిపారు.

టీఎంసీ ఇంకా ఇండియా పక్షంలో భాగమేనని చెప్పారు జైరాం రమేష్. కూటమిలో అందరు సభ్యులూ ఒకే గళంతో మాట్లాడాలని సూచించారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేమన్నారు. ఇండియా కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయన్నాయని తెలిపారు. ఒకవేళ ఎవరికి వారే విడివిడిగా పోరాడాలని నిర్ణయించుకుంటే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని సూచించారు. బంగాల్‌లో టీఎంసీ ఇండియా కూటమితోనే పోరాడుతుందని తాము భావిస్తున్నట్లు జైరాం రమేష్ పేర్కొన్నారు. ఇప్పటికే జేడీయూ ఇండియా కూటమిని వదిలి ఎన్డీఏ కూటమిలో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా టీఎంసీ బాటలోనే వెళుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+